చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఇటీవల జరిగిన భారీ ఎన్‌కౌంటర్ తర్వాత కనిపించకుండా పోయిన కోబ్రా కమాండర్ రాకేశ్వర్ సింగ్ మన్‌హాస్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్న సంగతి తెలిసిందే..! మావోయిస్టులు చెబుతున్నట్లుగా నిజంగానే అతడు వారి చెరలో ఉన్నాడా? అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. ఎన్‌కౌంటర్ జరిగిన సమీప గ్రామాల్లోని వారిని ప్రశ్నిస్తున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో క్షుణ్ణంగా గాలించినా రాకేశ్వర్ జాడ తెలియలేదని ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు.
తాజాగా అతడు మావోయిస్టుల చెరలో బందీగా ఉన్నాడని క్లారిటీ వచ్చింది. కోబ్రా జవాన్ రాకేశ్వర్ సింగ్ తాజా ఫోటోను బుధవారం మావోయిస్టులు విడుదల చేశారు. రాకేశ్వర్ తమ దగ్గరే సురక్షితంగా ఉన్నాడని మావోలు తెలిపారు. తమ వద్ద బందీగా ఉన్న రాకేశ్వర్‌ను విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని మంగళవారం మావోయిస్ట్ పార్టీ విడుదల చేసిన లేఖలో తెలిపింది. ప్రభుత్వం చర్చలకు మధ్యవర్తులను ప్రకటిస్తే రాకేశ్వర్‌ను విడుదల చేస్తామని మావోయిస్టులు తెలిపారు. మధ్యవర్తుల పేర్ల విషయంలొ కూడా స్పష్టత ఇవ్వాలన్నారు.