'ఆయన మరణం దేశానికి తీరని లోటు'.. మన్మోహన్ మృతిపట్ల ప్రముఖుల సంతాపం
మాజీ ప్రధాని మన్మోహన్ మృతిపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. అత్యంత గొప్ప నాయకుల్లో ఒకరైన నేతను దేశం కోల్పోయిందన్నారు.
By అంజి Published on 27 Dec 2024 7:09 AM IST'ఆయన మరణం దేశానికి తీరని లోటు'.. మన్మోహన్ మృతిపట్ల ప్రముఖుల సంతాపం
మాజీ ప్రధాని మన్మోహన్ మృతిపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. అత్యంత గొప్ప నాయకుల్లో ఒకరైన నేతను దేశం కోల్పోయిందన్నారు. నిరాడంబరమైన మూలాల నుంచి ఎదిగి గౌరవనీయమైన ఆర్థికవేత్తగా ఎదిగారని కొనియాడారు. మన ప్రధానిగా ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఆయన విస్తృతంగా కృషి చేశారని ప్రశంసించారు.
మన్మోహన్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మన్మోహన్ మరణం దేశానికి తీరని లోటని, కేంద్ర ఆర్థిక మంత్రిగా అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని, ప్రధానిగా దేశానికి సేవలు అందించారని చంద్రబాబు కొనియాడారు. మన్మోహన్ గొప్ప ఆర్థిక వేత్త, మానవతావాది, అసలైన నవభారత నిర్మాత, భరతమాత ఓ గొప్ప కుమారుడిని కోల్పోయింది అని రేవంత్ పేర్కొన్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి అందరికీ తీరని లోటని రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశ ఆర్థిక సంస్కరణల్లో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. మన్మోహన్‌ను దేం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మన్మోహన్ ఇక లేరన్న విషయం బాధకు గురిచేసిందని ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ అన్నారు. దేశం ఒక మహోన్నత వ్యక్తిని కోల్పోయిందని చెప్పారు.
అపార జ్ఞానం, సమగ్రతతో మన్మోహన్ సింగ్ దేశాన్ని ముందుకు నడిపించారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అననారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తన గురువు, మార్గదర్శిని కోల్పోయానన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారుజ ఆర్థిక శాస్త్రంలో మన్మోహన్‌కు ఉన్న లోతైన అవగాహన దేశానికి ఓ స్ఫూర్తి అని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఆయన నిజాయితీ మనకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకమని ఎంపీ ప్రియాంకా గాంధీ చెప్పారు..
మాజీ ప్రధాని మన్మోహన్ మృతి పట్ల కాంగ్రెస్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.