బెంగళూరు రోడ్లపై 'యాపిల్ విజన్ ప్రో' తో..!!

యాపిల్ విజన్ ప్రో.. ప్రస్తుతం ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో తెగ ఉపయోగించేస్తూ ఉన్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 13 Feb 2024 7:45 PM IST

man, Apple Vision Pro,  Bengaluru streets,

 బెంగళూరు రోడ్లపై 'యాపిల్ విజన్ ప్రో' తో..!!

యాపిల్ విజన్ ప్రో.. ప్రస్తుతం ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో తెగ ఉపయోగించేస్తూ ఉన్నారు. ఇంకా భారతదేశ మార్కెట్ లోకి విజన్ ప్రో రాలేదు. అయితే ఇప్పుడు ఆ సమయం కూడా వచ్చేసింది. ఒక యువకుడు బెంగళూరు రోడ్లపై విజన్ ప్రోతో కనిపించేశాడు. Apple Vision Pro, వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్ ని ధరించి బెంగళూరు రోడ్లపై పరీక్షిస్తున్నట్లు చూపించే పోస్ట్ ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించింది. ఇందిరానగర్ పరిసర ప్రాంతంలో వరుణ్ మయ్య అనే టెక్కీ విజన్ ప్రోతో నడుస్తూ కనిపించాడు. ఈ దృశ్యాలు కాస్తా వైరల్ అయ్యాయి.

యాపిల్ విజన్ ప్రో కొనాలంటే 2.8 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఆకర్షించే అధునాతన ఫీచర్‌లు ఎన్నో ఉన్నాయి. వారి వర్చువల్ అనుభవాలను వాస్తవ ప్రపంచంలోకి తీసుకువెళుతోంది. బెంగుళూరులో ఆపిల్ విజన్ ప్రో వీధుల్లో కనిపించడంతో త్వరలోనే భారతదేశంలో కూడా ఈ సూపర్ స్మార్ట్ గ్యాడ్జెట్ సందడి చేయనుంది.


Next Story