5 నెలల కొడుకు మృతదేహాన్ని బ్యాగులో పెట్టుకుని.. బస్సులో 200 కి.మీ ప్రయాణం

పశ్చిమ బెంగాల్‌లోని ఓ వ్యక్తి అంబులెన్స్‌కు అధిక ధర చెల్లించలేక తన ఐదు నెలల కుమారుడి మృతదేహాన్ని బ్యాగ్‌లో చుట్టి బస్సులో సిలిగురి

By అంజి  Published on  15 May 2023 9:41 AM IST
Ambulance, Dinajpur, Siliguri, West Bengal

5 నెలల కొడుకు మృతదేహాన్ని బ్యాగులో పెట్టుకుని.. బస్సులో 200 కి.మీ ప్రయాణం

పశ్చిమ బెంగాల్‌లోని ఓ వ్యక్తి అంబులెన్స్‌కు అధిక ధర చెల్లించలేక తన ఐదు నెలల కుమారుడి మృతదేహాన్ని బ్యాగ్‌లో చుట్టి బస్సులో సిలిగురి (డార్జెలింగ్ జిల్లా) నుండి కలియాగంజ్ (ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా) వరకు ప్రయాణించాడు. దాదాపు 200 కిలోమీటర్ల దూరం. ఈ ప్రయాణం శనివారం రాత్రి సిలిగురి బస్టాండ్ నుండి ప్రారంభమై ఆదివారం మధ్యాహ్నం కలియాగంజ్‌లో ముగిసింది. తండ్రి స్వయంగా తన కొడుకు మృతదేహాంతో తన బాధాకరమైన ప్రయాణాన్ని చేశాడు.

పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ దినాజ్‌పూర్ జిల్లాలోని డంగీపరా గ్రామానికి చెందిన తండ్రి అసిమ్ దేబ్శ్రమ కథనం ప్రకారం.. అతని భార్య కవల కుమారులకు జన్మనిచ్చింది. మే 7న, అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరు కుమారులను ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని రాయ్‌గంజ్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిలో చేరారు. వారి ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మెరుగుదల లేకపోవడంతో, ఇద్దరినీ డార్జిలింగ్ జిల్లాలోని సిలిగురి వద్ద ఉన్న నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ (NBMCH)కి రెఫర్ చేశారు.

మే 10న, ఇద్దరు కుమారులలో ఒకరి పరిస్థితి మెరుగుపడటంతో, అతన్ని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. అతని తల్లి, అసిమ్ భార్య తిరిగి మొదటి కొడుకును కలియాగంజ్‌లోని వారి నివాసానికి తీసుకెళ్లింది. అయినప్పటికీ రెండవ కొడుకు పరిస్థితి అస్థిరంగా ఉండటంతో.. చిన్నారి ఆస్పత్రిలోనే ఉన్నాడు. అతని తండ్రి అసిమ్ ఆసుపత్రిలో చిన్నారికి తోడుగా ఉన్నాడు.

శనివారం సాయంత్రం, అనారోగ్యంతో ఉన్న కొడుకు మరణించాడు. నిస్సహాయ తండ్రి తన కొడుకు మృతదేహాన్ని తిరిగి కలియాగంజ్‌లోని తన నివాసానికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ కోసం అంబులెన్స్ సేవలకు నిరాశగా కాల్ చేశాడు. ప్రభుత్వ అంబులెన్స్ సర్వీస్ ప్రొవైడర్, ఉచిత సేవను అందించాల్సి ఉంది. రూ. 8,000 చెల్లిస్తే తప్ప రాలేమని అటువైపు నుంచి సమాధానం వచ్చింది. దీంతో స్థానిక ఏజెంట్ సహాయంతో తన ఐదు నెలల కొడుకు మృతదేహాన్ని ఒక సంచిలో చుట్టి, ఆ బ్యాగ్‌తో సిలిగురి నుండి కలిగంజ్ వెళ్లే బస్సు ఎక్కాడు.

Next Story