ఎయిర్ హోస్ట్‌తో ప్రయాణికుడి అసభ్యకర ప్రవర్తన.. వీడియో

Man misbehaves with air hostess on Delhi-Hyderabad SpiceJet flight. ఢిల్లీ-హైదరాబాద్ స్పైస్‌జెట్ విమానంలో సోమవారం ఎయిర్ హోస్టెస్‌తో అనుచితంగా

By అంజి  Published on  24 Jan 2023 9:41 AM IST
ఎయిర్ హోస్ట్‌తో ప్రయాణికుడి అసభ్యకర ప్రవర్తన.. వీడియో

ఢిల్లీ-హైదరాబాద్ స్పైస్‌జెట్ విమానంలో సోమవారం ఎయిర్ హోస్టెస్‌తో అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిని అరెస్టు చేశారు. కలిసి ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు ఎయిర్ హోస్టెస్‌తో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఇందిరాగాంధీ నేషనల్‌ ఎయిర్‌పోర్టులో పోలీసులకు అప్పగించారు. అయితే పోలీసులు ఒక వ్యక్తిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. కాగా ఎయిర్‌ హోస్టెస్‌తో ప్రయాణికుడు అనుచితంగా ప్రవర్తించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు ప్రయాణికుడు క్యాబిన్‌ సిబ్బందిపై అరుస్తున్నట్లు వీడియో కనిపించింది.


అదే సమయంలో మరో ప్రయాణికుడు అరుస్తున్న వ్యక్తికి సపోర్ట్‌గా నిలిచాడు. కొంతమంది ప్రయాణికులు కూడా జోక్యం చేసుకుని వాదనను ఆపేందుకు ప్రయత్నించారు. ఢిల్లీ-హైదరాబాద్ విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు ఈ వీడియోను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ-హైదరాబాద్‌ స్పైస్‌జెట్‌ విమానంలో మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన నిందితుడిని స్పైస్‌జెట్ సెక్యూరిటీ అధికారి ఫిర్యాదు మేరకు అరెస్టు చేశారు. అలాగే కేసు కూడా పెట్టారు

''ఢిల్లీలో బోర్డింగ్ సమయంలో ఒక ప్రయాణికుడు వికృతంగా, అనుచితంగా ప్రవర్తించాడు. క్యాబిన్ సిబ్బందిని వేధించడంతో పాటు కలవరపరిచాడు. సిబ్బంది అదే విషయాన్ని PIC (పైలట్ ఇన్ కమాండ్), భద్రతా సిబ్బందికి తెలియజేశారు. కలిసి ప్రయాణిస్తున్న ప్రయాణీకుడు, సహ-ప్రయాణికుడు ఆఫ్‌లోడ్ చేయబడి భద్రతా బృందానికి అప్పగించబడ్డారు'' అని స్పైస్‌జెట్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

Next Story