కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. ముఖ్యంగా చనిపోయిన వారి ముఖాలను కూడా చూపించడం లేదు. దీంతో కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కరోనా రోగి మృతదేహాలను అధికారులే ఖననం చేస్తూ ఉన్నారు. అయితే ఓ వ్యక్తి స్మశానంలో కరోనా రోగి మృతదేహాన్ని పీక్కు తిన్నాడనే వార్త వైరల్ అవుతూ ఉంది.
ఓ యువకుడు మాత్రం ఏకంగా కరోనా రోగుల మృతదేహాలను పీక్కుతింటున్నాడు. శ్మశాన వాటికలో సగం కాలిన మృతదేహాలను తింటున్నాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహారాష్ట్ర లోని సతారా జిల్లాలోని కోలకి గ్రామ పంచాయతీ శ్మశాన వాటికలో ఓ యువకుడు కనిపించాడు. అతడు శ్మశాన వాటికలో తిరుగుతూ సగం కాలిన కరోనా మృతదేహాల అవయవాలను తింటున్నట్లు స్థానికులు గమనించారు.
వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వగా.. అక్కడికి చేరుకునే లోపే అతడు పరారయ్యాడు. ఆ మతిస్థిమితం లేని వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ఎంతగానో ప్రయత్నించి పట్టుకున్నారు. అతడు హిందీ మాట్లాడుతున్నాడని.. పేరు, ఊరు వివరాలు చెప్పడం లేదని అధికారులు వివరించారు. మతిస్థిమితం లేకే మృతదేహాలను తిని ఉండవచ్చని భావిస్తూ ఉన్నారు. అతడిని వైద్యులు పరీక్షిస్తూ ఉన్నారు. నిజంగానే అతడు కరోనా రోగుల మృతదేహాలను పీక్కు తిన్నాడా..? లేక అపోహ మాత్రమేనా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.