త‌న ప్రేమ‌ను ఒప్పుకునేలా చేయాలంటూ క‌మిష‌న‌ర్‌కు ట్వీట్‌.. దిమ్మ‌దిరిగే ఆన్స‌ర్‌.. నెట్టింట వైర‌ల్

Man asks Pune Police Commissioner for love help.ఇటీవ‌ల కాలంలో స్మార్ట్‌ఫోన్ లేనివారంటూ దాదాపుగా లేరు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 March 2021 12:16 PM GMT
త‌న ప్రేమ‌ను ఒప్పుకునేలా చేయాలంటూ క‌మిష‌న‌ర్‌కు ట్వీట్‌.. దిమ్మ‌దిరిగే ఆన్స‌ర్‌.. నెట్టింట వైర‌ల్

ఇటీవ‌ల కాలంలో స్మార్ట్‌ఫోన్ లేనివారంటూ దాదాపుగా లేరు. ప్ర‌తి ఒక్క‌రి చేతిలోనూ స్మార్ట్‌ఫోన్ ఉంటుంది. దీంతో సోష‌ల్ మీడియాలో వేదిక‌గా కొంద‌రు స‌మ‌స్య‌ల‌ను ఏక‌రువు పెడుతున్నారు. కొంద‌రు దీనిని దుర్వినియోగం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అధికారులు, నాయ‌కులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్నారు. తాజాగా ఓ పోలీస్ క‌మిష‌న‌ర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌జ‌ల‌తో లైవ్ చాట్‌లో మాట్లాడారు. అయితే.. ఓ నెటిజ‌న్ విచిత్ర ప్ర‌తిపాద‌న‌ను సీపీ ముందు ఉంచాడు. అందుకు సీపీ ఇచ్చిన స‌మాధానం వాహ్వా అనిపిస్తోంది.

పుణె నగర కమిషనర్ అమితాబ్ గుప్తా.. 'లెట్స్ టాక్ సీపీ పుణెసిటీ' పేరుతో ట్విట్టర్ లైవ్‌లోకి వచ్చారు. ప్ర‌జ‌లు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పారు. ఓ నెటిజ‌న్.. వింత ప్ర‌తిపాద‌న పెట్టాడు. త‌న ల‌వ్ ప్ర‌పోజ‌ల్ అంగీక‌రించేలా త‌న స్నేహితురాలిని ఒప్పించాల‌ని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసిన సీపీ ఏ మాత్రం స‌హ‌నం కోల్పోకుండా అత‌డి ప్ర‌తిపాద‌న‌ను సున్నితంగా తిర‌స్క‌రించారు. ఆ యువ‌తి అనుమ‌తి లేకుండా.. ఆమె ఇష్టం లేకుండా ఈ విష‌యంలో నీకు మేం ఏ విధంగా సాయం చేయ‌లేము. నువ్వు కూడా ఆమెకు వ్య‌తిరేకంగా ఎలాంటి పనులు చేయ‌కు. బ‌హుశా ఏదో ఒక‌రోజు ఆ యువ‌తి నీ ప్రేమ‌ను అంగీక‌రిస్తే.. నీకు మా అభినంద‌న‌లు, ఆశీస్సులు ఉంటాయ‌ని సీపీ ట్వీట్ చేశారు. అంతేకాదు.. 'నోమీన్స్‌నో' అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ఆయన జతచేసి ఆయన ట్వీట్ చేశారు.

సీపీ ఇచ్చిన స‌మాధానంపై నెటీజ‌న్లు ఆనందం వ్య‌క్తం చేశారు. బాగా చెప్పారు స‌ర్ అంటూ ఆయ‌న్ని కొనియాడుతున్నారు. ఇలాంటి చెత్త ప్ర‌శ్న‌ల‌తో పోలీసుల స‌మ‌యాన్ని వృధా చేయొద్ద‌ని కొంద‌రు నెటీజ‌న్లు ట్వీట్లు చేస్తున్నారు.


Next Story
Share it