అహ్మదాబాద్‌కు చెందిన 38 ఏళ్ల మహిళ కొత్త బట్టలు కొనివ్వాలని అడిగినందుకు, తనను విడిచిపెట్టాడని తన భర్తపై కేసు పెట్టింది. ఘట్లోడియా నివాసి అయిన బాధితురాలు, తన భర్త, అత్తమామలు కట్నం కోసం తనను హింసించారని, తనను విడిచిపెట్టారని ఆరోపించింది. పాత బట్టలు తనకు సరిపోవని, కొత్త బట్టలు కొనమని భర్తను కోరినట్లు మహిళ పోలీసులకు తెలిపింది. అత్తమామల వేధింపులతో విసిగిపోయిన బాధితురాలు 2017లో భర్త ఇంటి నుంచి వెళ్లిపోయింది. కానీ 2021లో అతడి ఇంటికి తిరిగివచ్చి, తాను వదిలేసిన బట్టలు చినిగిపోయాయని లేదా సరిపోలేదని గుర్తించింది. ఆమె కొత్త బట్టలు కొనమని భర్తను అడగ్గా, అతడు ఆమెను విడిచిపెట్టాడు.
"నేను నవంబర్ 11, 2016న పటాన్‌కు చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నాను, కానీ వివాహం అయిన వెంటనే, నా భర్త, నా అత్తమామలు నన్ను హింసించడం ప్రారంభించారు" అని ఆమె పేర్కొంది. రూ.15 లక్షల కట్నం కోసం అత్తమామలు కొట్టారని బాధితురాలు ఆరోపించింది. ఈ వైఖరితో బాధపడిన ఆమె 2017లో తన భర్త ఇంటిని విడిచిపెట్టి, అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాని తర్వాత ఆమె భర్త సమస్యపై రాజీకి రావాలని కోరింది. భర్తను నమ్మి, అత్తమామలు ఇచ్చిన హామీతో ఆ మహిళ నాలుగేళ్ల తర్వాత జనవరిలో అతని ఇంటికి తిరిగి వచ్చింది. తను విడిచిపెట్టిన బట్టలు చిరిగిపోయాయని లేదా ఇకపై తనకు సరిపోవని ఆమె గ్రహించింది. తన భర్త తనను బజారుకు తీసుకెళ్లాడని, తన వద్ద ఉంచుకోవడం ఇష్టం లేకపోవడంతో తిరిగి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లమని చెప్పి అక్కడే వదిలేసి వెళ్లాడని పోలీసులకు తెలిపింది.