ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో బెంగాల్ పీఠంపై భారతీయ జనతా పార్టీ ఎంతో కాన్సట్రేషన్ చేసింది. బెంగాల్ ప్రజలు ఆనందంగా లేరని.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీని గద్దె దింపబోతూ ఉన్నామని గట్టిగా చెప్పుకొంది. ఏకంగా 200 సీట్లు కూడా సాధిస్తామని కొందరు నాయకులు బల్ల గుద్ది మరీ మాట్లాడారు. మమతా బెనర్జీకి వెన్నంటి ఉన్న ఎంతో మంది నాయకులను బీజేపీ ఆకర్షించింది. అలా దీదీకి వెన్నుపోటు పొడిచిన నాయకులు.. ఆమె మీద ఎన్నో వ్యాఖ్యలు చేశారు. దీదీని ఒకప్పుడు దేవత అని పొగిడిన ఆ నోళ్లే ఆమె ఓ రాక్షసి అంటూ ఆరోపణలు గుప్పించారు. అయినప్పటికీ ఆ నాయకుల మాటలను ప్రజలు వినలేదు.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ దక్కుతూ ఉంది.

స్పష్టమైన ఆధిక్యంతో పార్టీ దూసుకుపోతున్న నేపథ్యంలో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఇంటిముందు టీఎంసీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. 205 స్థానాల్లో ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది. బీజేపీ 75-85 స్థానాల్లో మాత్రమే లీడ్ ను కొనసాగిస్తూ ఉంది.

నందిగ్రామ్ లో మమతా బెనర్జీ ఆధిక్యం లోకి దూసుకు వచ్చారు. నాలుగు రౌండ్లు పూర్త‌య్యే స‌మ‌యంలో ఆమె నందిగ్రామ్ లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కంటే 8,000 ఓట్ల వెనుకంజ‌లో ఉన్న విష‌యం తెలిసిందే. తర్వాతి రౌండ్ల‌లో ఆమె అనూహ్యంగా పుంజుకున్నారు. ఆరు రౌండ్ల ఓట్ల త‌ర్వాత ఆమె 1,427 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.


సామ్రాట్

Next Story