స్టేజ్‌పైనే మల్లికార్జున ఖర్గేకు స్వల్ప అస్వస్థత (వీడియో)
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 29 Sept 2024 6:45 PM ISTకాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జమ్ముకశ్మీర్‌లో మూడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు పూర్తవగా.. చివరి దశ ఎన్నికల్లో జరగబోతున్నాయి. ఇందుకోసం పార్టీ తరఫున జమ్ముకశ్మీర్‌లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సభలో పాల్గొన్నారు. ఈ మేరకు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుండగా.. ఆయన స్టేజ్ పైనే స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల సభలోనే కళ్లు తిరిగి కిందపడిపోబోయారు. ఇక వెంటనే గమనించిన స్టేజీపైన ఉన్న నాయకులు.. లేకి మల్లికార్జున ఖర్గేను పట్టుకున్నారు.
ఆ తర్వాత మల్లికార్జున ఖర్గేకు మంచినీళ్లు అందించారు. నీళ్లు తాగిన తర్వాత కొద్దిక్షణాలకే నార్మల్ అయిన మల్లికార్జున ఖర్గే తిరిగి ప్రసంగాన్ని ప్రారంభించారు. మల్లికార్జున ఖర్గే ప్రసంగం కొనసాగినంతసేపు.. స్టేజీపై ఉన్న నాయకులు ఖర్గేను పట్టుకునే ఉన్నారు. ఖర్గే అస్వస్థతకు గురై ఇబ్బంది పడ్డ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జమ్ముకశ్మీర్ ఎన్నికల సభలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తిరిగి తీసుకువస్తామని మాటిచ్చారు. ఇందుకోసం పోరాడుతూనే ఉంటామని అన్నారు. తాను అప్పుడే చనిపోనని,మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు అలసిపోనని సవాల్ చేశారు.
కాగా,జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. మూడో విడత పోలింగ్ సోమవారం జరగనుంది. ఇక్కడ మొత్తం 3 విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
जम्मू कश्मीर में एक सभा के दौरान हमारे राष्ट्रीय अध्यक्ष आदरणीय @kharge साहब की तबियत बिगड़ी ईश्वर हमारे खड़गे साहब को जल्द से जल्द ठीक करे।🙏🏻 pic.twitter.com/rgvidn4fUB
— Rahul Baghel (@RahulBa42905365) September 29, 2024