మలబార్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం
Malabar Express catches fire near Varkala Station.మలబార్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
By తోట వంశీ కుమార్ Published on
17 Jan 2021 6:16 AM GMT

మలబార్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కేరళలోని తిరువనంతపురం జిల్లా వర్కాల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళూరు నుంచి తిరువనంతపురం వెలుతున్న మలబార్ ఎక్స్‌ప్రెస్ రైలు వర్కాల సమీపంలోకి చేరుకున్న సమయంలో పార్శిల్ భోగిలో మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపిస్తుండడంతో.. గమనించిన ప్రయాణీకులు వెంటనే గార్డుకు సమాచారం అందించారు. ఇతర బోగీలకు మంటలు వ్యాపించకుండా చైను లాగి రైలును ఆపివేశారు. వెంటనే ప్రయాణీకులు అందరూ కిందకి దిగారు.
ప్రయాణీకులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రస్తుతం రైలు ఎడవా గ్రామం వద్ద ఆగి ఉంది. సమాచారం ప్రకారం.. వర్కోలా, పరపూర్ స్టేషన్ల మధ్య ఎడావ వద్ద ఉదయం 7.40 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Next Story