నడిరోడ్డుపై ఇంజినీర్ చెంపలు వాయించిన మహిళా ఎమ్మెల్యే..వీడియో వైరల్
మహారాష్ట్ర థానే జిల్లాలో ఓ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకుంది. ఇంజినీర్‌ను నడిరోడ్డుపై నలబెట్టి చేయిచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 21 Jun 2023 8:39 AM GMTనడిరోడ్డుపై ఇంజినీర్ చెంపలు వాయించిన మహిళా ఎమ్మెల్యే..వీడియో వైరల్
మహారాష్ట్ర థానే జిల్లాలో ఓ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకుంది. ఇంజినీర్‌ను నడిరోడ్డుపై నలబెట్టి చేయిచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. సదురు ఎమ్మెల్యే తీరును నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
థానే జిల్లాలోని మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలోనే కాషిమిరాలోని పెంకర్ పెడా ప్రాంతంలో అక్రమ నిర్మాణలను ఇంజినీర్లు శుభమ్ పాటిల్, సోనీ ఆధ్వర్యంలో కూల్చేస్తున్నారు. కూల్చివేతలు జరుపుతున్న సమయంలో వర్షాలు కురుస్తాయి. దీంతో.. నిరాశ్రయులైన కొందరు ఆరు నెలల చిన్నారి సహా పలువురు వృద్ధులు వర్షంలోనే గడపాల్సి వచ్చింది. ఇదే విషయం తెలుసుకున్న మీరా భయందర్ ఎమ్మెల్యే గీతా జైన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. పనులు చేయిస్తున్న ఇంజినీర్లను నిలదీశారు. అలా ఎలా కూల్చేస్తారంటూ ప్రశ్నించారు. అయితే.. అక్రమ నిర్మాణాలని చెప్పినా ఆమె పట్టించుకోలేదు. జూనియర్ సివిల్ ఇంజినీర్ శుభమ్ పాటిల్‌ను నడిరోడ్డుపై నిలబెట్టి అందరూ చూస్తుండగానే చెంపలు చెల్లుమనిపించింది. ఇదంతా అక్కడే ఉన్న కొందరు వీడియో తీశారు. ప్రస్తుతం ఇదే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఎమ్మెల్యే తీరుని గీతాజైన్ తీరుని తప్పు బడుతున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చేయడంలో తప్పేముంది అంటూ ప్రశ్నిస్తున్నారు.
కాగా.. ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే మాత్రం ఆమె తీరుని సమర్ధించుకున్నారు. ఇంజినీర్లను వర్షాకాలానికి ముందే ఎందుకు కూల్చలేదని ప్రశ్నించానని చెప్పారు. స్థానికుల ఇబ్బందులను గమనించే ఇంజినీర్‌ను నిలదీశానని చెప్పుకొచ్చారు. తాను చేసిన పనికి పశ్చాత్తాపం పడటం లేదని.. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే గీతా జైన్ అన్నారు. గీతా జైన్ గతంలో బీజేపీ నుంచి మేయర్ గా పనిచేశారు. 2019 మహారాష్ట్ర ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఆమె బీజేపీ, శివసేన ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ఈ ఘటన రాజకీయంగానూ దుమారం లేపుతోంది.
आमदार गीता जैन ताई ही कुठली पद्धत आहे अधिकाऱ्यावर हात उचलून प्रश्न सोडवण्याची.अधिकारी चुकला असेल तर सरकार मधे आहात कायदेशीर कार्यवाही करा कायदा हातात घेण्याचा अधिकार तुम्हाला कोणी दिला आहे ? @CMOMaharashtra यांच्यावर कार्यवाही करणार की आमदारांना कायदा हातात घेण्याची सूट आहे ? pic.twitter.com/ndJGyhLVyR
— Suraj Chavan (सूरज चव्हाण) (@surajvchavan) June 20, 2023