భారీ వర్షాలతో కూలిన హోర్డింగ్, వాహనాలు ధ్వంసం (వీడియో)

మహారాష్ట్రలో భారీ వర్షాలు పడుతున్నాయి.

By Srikanth Gundamalla
Published on : 2 Aug 2024 1:30 PM IST

Maharashtra, heavy rain, hording collapse,

  భారీ వర్షాలతో కూలిన హోర్డింగ్, వాహనాలు ధ్వంసం (వీడియో)

మహారాష్ట్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో.. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైకి వరద నీరు చేయడంతో చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలతో పాటుగా ఈదురుగాలులు కూడా వీస్తుండటంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కొన్ని చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరుగుతున్నాయి. తాజాగా థానే జిల్లాలో భారీ వర్షం, గాలుల కారణంగా భారీ హోర్డింగ్ ఉన్నట్లుండి కుప్పకూలింది. ఈ సంఘటనలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి.

థానేలోని కల్యాణ్‌ ప్రాంతంలో శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. రద్దీగా ఉన్న సంహజానంద్‌ చౌక్‌లో భారీ హొర్డింగ్ ఉంది. అయితే.. ఉదయం నుంచి భారీ వర్షంతో పాటు గాలులు పెద్ద ఎత్తు వీచాయి. దాంతో.. గాలులకు నిలబడలేకపోయిన ఒక భారీ హోర్డింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. అక్కడే ఉన్న వాహనాలపై పడిపోయింది. దాంతో.. మూడు వెహికల్స్‌ ప్రమాదంలో ధ్వంసం అయ్యాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు ఆటోలు, కారు, బైకులు ఉన్నాయి. అయితే.. వర్షం పడుతుండటంతో కొందరు షెల్టర్‌గా అదే హోరింగ్ కింద ఉన్నారు. నేరుగా హోర్డింగ్ వాహనాలపై పడింది. ఎంత మందికి గాయాలు అయ్యాయనేది తెలియాల్సి ఉంది.

Next Story