మ్యాన్‌ హోల్‌లో పడి బాలుడు మృతి, సీసీ కెమెరాల్లో రికార్డు

మహారాష్ట్రలో మ్యాన్‌ హోల్‌లో పడి ఓ బాలుడు చనిపోయాడు.

By Srikanth Gundamalla
Published on : 5 Aug 2024 11:28 AM IST

Maharashtra, four years boy, fell down,  man hole, died ,

 మ్యాన్‌ హోల్‌లో పడి బాలుడు మృతి, సీసీ కెమెరాల్లో రికార్డు 

వర్షాలు పడుతున్న నేపథ్యంలో నగరాల్లో రోడ్లపై నిలిచి వున్నవరద నీరు త్వరగా పోవాలని..అక్కడక్కడ మ్యాన్‌ హోల్స్‌ తెరిచి పెడతారు. వరద నీరు మొత్తం వెళ్లిపోయాక సిబ్బంది వాటిని మళ్లీ మూసివేస్తారు. కొన్నిసార్లు మ్యాన్‌ హోళ్లు మూతవేయం మర్చి పోవడం జరుగుతుంటాయి. ఇలా చేయడం వల్ల కొందరు ప్రాణాలు కోల్పోయారు కూడా. తాజాగా మహారాష్ట్రలో కూడా మ్యాన్‌ హోల్‌లో పడి ఓ బాలుడు చనిపోయాడు.

ఆదివారం సాయంత్రం ముకుంద్‌ నాగాడ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇంటి దగ్గర ఆడుకుంటున్న బాలుడు అనుకోకుండా మ్యాన్‌హోల్‌లో పడిపోయాడు.సమర్‌ షేక్‌ అనే నాలుగేళ్ల బాలుడు తన ఇంటి వద్ద ఆడుకుంటూ ముందుకు నడిచాడు. అయితే.. అప్పటికే అక్కడ ఉన్న మ్యాన్‌హోల్‌ను తెరిచిన సిబ్బంది.. ఆ తర్వాత మూసివేశారు. కానీ.. నిర్లక్ష్యంగా సరిగా మూతవేయకపోవడం వల్ల ఆ బాలుడు ఆ మ్యాన్‌ హోల్‌ పైనుంచి వెళ్లేందుకు ప్రయత్నించి అందులో పడిపోయాడు. ఇక ఇంటికి ఎంతకీ తిరిగి రాకపోవడంతో బాలుడి కోసం తల్లిదండ్రులు వెతికారు. గల్లీల్లో వెతికి చూశారు. చివరకు అక్కడున్న సీసీ కెమెరాలను పరిశీలించారు. బాలుడు వెళ్తూ వెళ్తూ మ్యాన్‌ హోల్‌లో పడిపోవడాన్ని చూశారు. వెంటనే చిన్నారిని బయటకు తీశారు. కానీ.. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story