ఆ దుర్ఘటనకు యూపీ ప్రభుత్వానిదే బాధ్య‌త.. సుప్రీంలో వ్యాజ్యం

మ‌హా కుంభ‌మేళాలో మౌని అమావాస్య సంద‌ర్భంగా కోట్లాది మంది భ‌క్తులు పుణ్య స్నానాలు చేయడానికి త‌ర‌లిరావ‌డంతో సంగం ఘాట్ వ‌ద్ద చోటుచేసుకున్న తొక్కిస‌లాట‌లో 30 మంది ప్రాణాలు కోల్పోయారు.

By అంజి  Published on  30 Jan 2025 12:24 PM IST
Maha Kumbh stampede, PIL, Supreme Court, pilgrims

ఆ దుర్ఘటనకు యూపీ ప్రభుత్వానిదే బాధ్య‌త.. సుప్రీంలో వ్యాజ్యం 

మ‌హా కుంభ‌మేళాలో మౌని అమావాస్య సంద‌ర్భంగా కోట్లాది మంది భ‌క్తులు పుణ్య స్నానాలు చేయడానికి త‌ర‌లిరావ‌డంతో సంగం ఘాట్ వ‌ద్ద చోటుచేసుకున్న తొక్కిస‌లాట‌లో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై యూపీలోని యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌భుత్వం బాధ్య‌త వ‌హించాలంటూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు అయింది. విశాల్ తివారీ అనే న్యాయ‌వాది ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

భ‌విష్య‌త్తులో ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా రాష్ట్రాల‌కు స్ప‌ష్ట‌మైన, విధాన‌ప‌ర‌మైన మార్గ‌ద‌ర్శ‌కాలు ఇవ్వాల‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. భ‌క్తుల భ‌ద్ర‌త‌ ప్ర‌మాదంలో ప‌డ‌కుండా నివారించేలా వీఐపీల క‌ద‌లిక‌ల‌ను ఆపాల‌ని కోరారు. ఈ పిటిష‌న్ నేప‌థ్యంలో తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం స్టేట‌స్ రిపోర్ట్‌ను ఇవ్వాల్సి ఉంటుంది.

Next Story