అశ్లీల చిత్రాలు వ్యక్తిగతంగా చూడటం నేరంకాదు: మద్రాస్ హైకోర్టు
ఓ కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.
By Srikanth Gundamalla Published on 13 Jan 2024 9:31 AM ISTఅశ్లీల చిత్రాలు వ్యక్తిగతంగా చూడటం నేరంకాదు: మద్రాస్ హైకోర్టు
ఓ కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. మొబైల్ ఫోన్‌లో చిన్నారుల అశ్లీల చిత్రాలను డౌన్‌లౌడ్ చేసుకుని చూసినందుకు కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు ఇదే కేసుపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. వ్యక్తిగతంగా అశ్లీల చిత్రాలు చూడటం నేరం కాదని స్పష్టం చేసింది. ఇక తనపై నమోదు అయిన కేసును రద్దు చేయాలని అంబత్తూరుకు చెందిన యుకుడు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు.
శుక్రవారం సదురు యువకుడి పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టుకు హాజరైన యువకుడు తాను అశ్లీల సినిమాలు చూడటం నిజమే అని కోర్టు ముందు ఒప్పుకున్నాడు. కాకపోతే.. తాను చూసిన అశ్లీల చిత్రాలు చిన్నపిల్లలకు సంబంధించినవి కావనీ కోర్టుకు వివరించాడు. ఈ వ్యసనం నుంచి బయటపడేందుకు కౌన్సెలింగ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు కోర్టుకు తెలిపాడు. వాదోపవాదనల తర్వాత ఈ కేసును కొట్టివేస్తూ మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ ఉత్తర్వులు జారీ చేశారు.
కేసును కొట్టివేస్తూ మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. అశ్లీల చిత్రాలను ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని వ్యక్తిగతంగా చూడటంలో ఎలాంటి తప్పు లేదన్నారు. వాటిని ఇతరులకు షేర్ చేస్తేనే నేరమని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి అన్నారు. 1990లలోని యువత మద్యం, ధూమపానానికి ఎలా అలవాటు పడ్డారో.. ఇప్పుడున్న యువత అశ్లీల చిత్రాలకు బానిసలుగా మారారని చెప్పారు. వారిపై అనవసరంగా నిందలు మోపడం మానుకోవాలన్నారు. అయితే.. ఈ అలవాటు నుంచి వారిని ఎలా బయటకు తీసుకురావాలో ఆలోచించాలనీ.. అవసరమైన సలహాలు ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందుకు గాను స్కూల్ స్థాయి నుంచి అవగాహన కల్పించాలని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది.