Video: బిడ్డకు పాలు కావాలని అడిగిందని.. మహిళను దారుణంగా కొట్టారు

మధ్యప్రదేశ్‌లోని సాగర్ నగరంలో గురువారం బస్టాండ్‌లో మహిళను దారుణంగా కొట్టిన వీడియో వైరల్ కావడంతో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.

By అంజి  Published on  1 Sep 2023 4:45 AM GMT
Madhya Pradesh woman,  Sagar city , MP Congress

Video: బిడ్డకు పాలు కావాలని అడిగిందని.. మహిళను దారుణంగా కొట్టారు 

మధ్యప్రదేశ్‌లోని సాగర్ నగరంలో గురువారం బస్టాండ్‌లో మహిళను దారుణంగా కొట్టిన వీడియో వైరల్ కావడంతో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఆమె మతిస్థిమితం కోల్పోయిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఆ మహిళను ఈడ్చుకెళ్లి, కర్రలతో కొట్టారు. ఆమె 5 నెలల పసికందు నేలపై పడుకోగా, నిరుపేద మహిళను పురుషులు ఆమె జుట్టుతో లాగడం, ముఖంపై తన్నడం, చెక్క కర్రతో కొట్టడం వీడియోలో చూపబడింది. ప్రవీణ్ రైక్వార్ (26), విక్కీ యాదవ్ (20), రాకేష్ ప్రజాపతి (40)లను గోపాల్‌గంజ్ పోలీసులు గురువారం అరెస్టు చేసినట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ లోకేష్ సిన్హా తెలిపారు. స్థానిక సమాచారం ప్రకారం.. పోలీసులు నిందితులను కోర్టుకు తీసుకెళ్లి, జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

ప్రాథమిక విచారణ ప్రకారం, ఆగస్టు 12-13 మధ్య రాత్రి ఈ సంఘటన జరిగింది. బస్టాండ్‌లోని క్యాంటీన్‌లో పాలు కొనేందుకు మహిళ వెళ్లింది. ఏదో జరిగిందని, క్యాంటీన్‌లోని ముగ్గురు వ్యక్తులు ఆమెను కొట్టారని పోలీసులు తెలిపారు. ఆ వీడియోలో ఆమె కరుణించమని వేడుకుంటూ, ‘భయ్యా.. భయ్యా’ అంటూ ఏడుస్తున్నట్లు కనిపించింది. చుట్టుపక్కల వారు ఆమెను కొట్టవద్దని నిందితులను కోరడం వినిపించింది. సాగర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిషేక్ తివారీ మాట్లాడుతూ ఆ మహిళ మతిస్థిమితం లేనిదిగా కనిపించిందని పేర్కొన్నారు. విచారణ కొనసాగుతోందని ఆయన తెలిపారు.

మరోవైపు ఈ వీడియోని కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో ఆకలితో ఉన్న బిడ్డకు పాలు పట్టించినందుకు మహిళను హోటల్ సిబ్బంది దారుణంగా కొట్టారు అంటూ క్యాప్షన్ జోడించింది. మధ్యప్రదేశ్‌లో మహిళలకు భద్రత లేకుండా పోయిందంటూ వీడియో ద్వారా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై విరుచుకుపడింది కాంగ్రెస్ పార్టీ. శివరాజ్‌ని తొలగించండి, కుమార్తెలను రక్షించండి అంటూ క్యాప్షన్ జోడించింది.

Next Story