మధ్యప్రదేశ్‌లో ఆశ్చర్య ఘటన వెలుగు చూసింది. ఓ యువకుడు తీవ్ర కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లాడు. అతడి పరిస్థితిని చూసిన వైద్యులు కడుపులో ఏదో వస్తువు ఉందని అనుమానించారు. దాంతో.. స్కానింగ్ చేశారు. అడుగు పొడవైన వస్తువు ఉందని శస్త్ర చికిత్స చేశారు. ఈ నేపథ్యంలోనే అతని కడుపులో నుంచి అడుగు పొడవు ఉన్న సోరకాయను బయటకు తీశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఛతర్‌పుర్ జిల్లా ఖజురహో ప్రాంతానికి చెందిన యువకుడు తీవ్రమైన కడుపునొప్పితో జిల్లా ఆస్పత్రిలో చేరారు. పలు వైద్య పరీక్షల తర్వాత డాక్టర్ నందకిశోర్ జాదవ్ ఎక్సరే తీసి కడుపులో ఏదో పొడవైన వస్తువు ఉందని గుర్తించారు. శనివారం అతనికి ఆపరేషన్ చేసి కడుపులో తొడిమతో ఉన్న సోరకాయను బయటకు తీశారు. దాంతో.. వైద్యులు కూడా షాక్ అయ్యారు. ఆ సోరకాయ వల్ల యువకుడి పెద్ద పేగు నలిగిపోయింది. అతని శరీరంలోకి మలద్వారం ద్వారా వచ్చి ఉంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం యువకుడి పరిస్తితి ఆందోళనకరంగా ఉందని.. అయినా చికిత్స కొనసాగుతోందని చెప్పారు వైద్యులు. సోరకాయను ఎవరైనా బలవంతంగా చొప్పించారని అనుకుంటున్నారు. యుకుడు స్పృహలోకి వచ్చిన తర్వాత ఈవిషయంపై క్లారిటీ వస్తుందని వైద్యులు తెలిపారు.