దేశంలో వంటగ్యాస్ సంక్షోభం ఆందోళన కలిగిస్తోంది. వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా పలు నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. వంటగ్యాస్ కొరత నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన సీనియర్ అధికారులు సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. టీస్టాళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్ సహా ఆహార తయారీ కేంద్రాలు ఏవైనా ఎల్పీజీకి బదులుగా ఎలక్ట్రిక్ స్టౌవ్‌లను ఉపయోగిస్తే ఒక యూనిట్ విద్యుత్‌పై రూ.2 సబ్సిడీ అందించనున్నట్లు ప్రకటించారు. వంటగ్యాస్ కొరత తీవ్రత తగ్గేవరకు సబ్సిడీ వర్తిస్తుందని తమిళనాడు సీఎం వెల్లడించారు.