మార్చి 23న హోటల్స్ అన్నీ బంద్

ఎల్పీజీలో జరుగుతున్న జాప్యం, హోటల్స్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆందోళనల నేపథ్యంలో, కేరళ హోటల్ రెస్టారెంట్ అసోసియేషన్ మార్చి 23న రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది.

By -  Medi Samrat
Published on : 18 March 2026 3:23 PM IST

మార్చి 23న హోటల్స్ అన్నీ బంద్

ఎల్పీజీలో జరుగుతున్న జాప్యం, హోటల్స్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆందోళనల నేపథ్యంలో, కేరళ హోటల్ రెస్టారెంట్ అసోసియేషన్ మార్చి 23న రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నిరసనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేయనున్నారు. హోటళ్లను నిత్యావసర సేవల జాబితాలో చేర్చాలని, తగినంత ఎల్పీజీ సరఫరాను నిర్ధారించాలని డిమాండ్ చేయడమే ఈ చర్యల లక్ష్యమని అసోసియేషన్ తెలిపింది.

ప్రైవేట్ కంపెనీలు ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని ఎల్పీజీ ధరలను విపరీతంగా పెంచుతున్నాయని కూడా కేరళ హోటల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆరోపించింది. తమ నిరసన ప్రణాళికలో భాగంగా రోడ్లపై ఆందోళనకు కూడా దిగుతామని అసోసియేషన్ ప్రకటించింది. కొనసాగుతున్న ఈ పరిస్థితి హోటల్ పరిశ్రమతో పాటు వినియోగదారులను కూడా ప్రభావితం చేస్తోందని హెచ్చరించింది.

Next Story