ఎల్పీజీ సిలిండర్ల ధర భారీగా తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే.!

కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు శుభవార్త. 19 కిలోల కమర్షియల్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పిజి) సిలిండర్ల ధరలు

By అంజి  Published on  1 May 2023 3:59 AM GMT
LPG cylinder , commercial LPG cylinders,  Indian Oil Corporation

ఎల్పీజీ సిలిండర్ల ధర భారీగా తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే.!

కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు శుభవార్త. 19 కిలోల కమర్షియల్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పిజి) సిలిండర్ల ధరలు రూ. 171.50 తగ్గించబడ్డాయి. ఈ ధరలు ఇవాళ్టి (మే 1) నుండి అమలులోకి వచ్చినట్లు చమురు సంస్థలు తెలిపాయి. సవరణ తరువాత ఢిల్లీలో నేటి నుండి 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ రూ.1,856.50 ధరకు అందుబాటులో ఉంటుంది. ముంబైలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,808.50 కాగా, కోల్‌కతాలో ధర రూ.1,960.50కి తగ్గింది. చెన్నైలో 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ రూ.2,021.50కి అమ్ముడవుతోంది. సవరణకు ముందు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) ప్రకారం.. 19 కిలోల LPG సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 2,028, కోల్‌కతాలో రూ. 2,132, ముంబైలో రూ. 1,980, చెన్నైలో రూ. 2,192.50 ఉండేది. ఏప్రిల్ 1న యూనిట్‌కు రూ.91.50 తగ్గింది , ఆ తర్వాత ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.2,028గా ఉంది. అంతకుముందు మార్చి 1న కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలను రూ.350.50, డొమెస్టిక్‌ ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.50 పెంచారు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. 14.2 కేజీల సిలిండర్ ధరను కొనాలంటే ఇప్పుడు రూ. 1161 చెల్లించాలి. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ రేటే వర్తిస్తుంది. అదే హైదరాబాద్‌లో చూస్తే.. సిలిండర్ ధర రూ. 1155 వద్ద కొనసాగుతోంది.

Next Story