లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాకు క‌రోనా పాజిటివ్‌

Lok Sabha speaker OM Birla tested positive.లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాకు క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది.

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 21 March 2021 2:51 PM IST

Lok Sabha speaker OM Birla test corona positive

లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాకు క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది. ఈ నెల 19న ఆయ‌న‌కు కొవిడ్ పాజిటివ్ అని తేలింద‌ని.. శ‌నివారం ఆయ‌న‌ ఎయిమ్స్‌లో చేరిన‌ట్లు ఆ ఆసుప‌త్రి వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉన్న‌ద‌ని ఆదివారం రిలీజ్ చేసిన ప్రెస్ నోట్‌లో తెలిపింది.

ఇక భార‌త్‌లో క‌రోనా వైర‌స్ ఉద్దృతి కొన‌సాగుతోంది. కొత్త‌గా కేసులు న‌మోదుఅవుతుండ‌డంతో పాటు క్రియాశీల కేసులు, మ‌ర‌ణాల సంఖ్య పెరుగుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 11.33ల‌క్ష‌ల ప‌రీక్షలు చేయ‌గా.. 43,846 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,15,99,130కి చేరింది. కొత్తగా 22,956 మంది కోలుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు రిక‌వ‌రీ అయిన వారి సంఖ్య 1,11,30,288కి చేరింది. క‌రోనా మ‌ర‌ణాలు అంత‌క‌ముందు రోజు 188 న‌మోదు కాగా.. శ‌నివారం రికార్డు స్థాయిలో 197 మంది మ‌ర‌ణించారు. దీంతో ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,59,755కి చేరింది. దేశ వ్యాప్తంగా న‌మోదు అవుతున్న కేసుల్లో ఎక్కువ‌గా మ‌హారాష్ట్ర‌లోనే న‌మోదు అవుతున్నాయి. నిన్న ఒక్క‌రోజే 27 వేల‌కు పైగా కేసులు న‌మోదు అవుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.


Next Story