వారణాసిలో మోదీపై పోటీ చేస్తున్న ట్రాన్స్‌జెండర్.. వివరాలివే..

దేశంలో లోక్‌సభ ఎన్నికల సందడి కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు సిద్ధం అయ్యాయి

By Srikanth Gundamalla  Published on  9 April 2024 11:24 AM IST
lok sabha election, varanasi, narendra modi, transgender hemangi,

 వారణాసిలో మోదీపై పోటీ చేస్తున్న ట్రాన్స్‌జెండర్.. వివరాలివే..

దేశంలో లోక్‌సభ ఎన్నికల సందడి కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు సిద్ధం అయ్యాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో తమ అభ్యర్థులన ప్రకటించుకుని ప్రచారం చేస్తున్నాయి. తమతమ అభ్యర్థుల తరఫున పార్టీల అధినేతలు, ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక మరోవైపు అగ్రనాయకులు పోటీ చేస్తున్న లోక్‌సభ స్థానాలపై కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి లోక్‌సభ బరిలో నిలిచిన విషయం తెలిసిందే.

ఇదే నియోజకవర్గం నుంచి నరేంద్ర మోదీపై ఓ ట్రాన్స్‌జెండర్‌ కూడా పోటీ చేస్తున్నారు. అఖిల భారత హిందూ మహాసభ (ABHM)కు చెందిన హేమాంగి సఖి మాత బరిలో నిల్చున్నారు. గుజరాత్‌లోని వడోదర ప్రాంతానికి చెందిన ఆమె.. ప్రపంచంలోనే భగవద్గీతను బోధిస్తున్న మొదటి ట్రాన్స్‌ జెండర్ కావడం విశేషం. అయితే.. ప్రధాని నరేంద్ర మోదీపై ట్రాన్స్‌జెండర్ పోటీ చేస్తుండటంతో.. ఆమె గురించి నెటిజన్లు.. సామాన్య ప్రజలు సోషల్‌ మీడియా, గూగుల్‌లో ఆరా తీస్తున్నారు. హేమాంగి సఖి మాత 2019లో ఆచార్య మహాంమండలేశ్వర్‌గా పట్టాభిషిక్తులయ్యారు. ఆమె తండ్రి ఫిలిం డిస్ట్రిబ్యూటర్‌. దాంతో.. ఆమె కుటుంబ సభ్యులతో పాటుగా ముంబైకి వచ్చేసింది. గొప్ప ఆధ్యాత్మికపరురాలిగా ఉన్న హేమాంగి సఖి మాత వారణాసిలో పోటీ చేస్తున్నారు. ఇక హిందూత్వ నినాదాన్నే ఊపిరిగా ముందుకు వెళ్తున్న బీజేపీకి ఆమె పోటీ చేస్తుండటం ఎంత వరకు ఇబ్బంది అవుతుందనే దానిపై నెట్టింట చర్చ జరుగుతోంది.

గత రెండు ఎన్నికల్లోనూ నరేంద్ర మోదీపై ఆప్, ఎస్‌పీ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. వారు సెక్యూలర్‌ భావాజాలంతో ముందుకు సాగారు. కాని.. హిందూత్వ నినాదం ఏకమొత్తంగా బీజేపీనే అక్కడ ఎత్తుకుంది. ఇప్పుడు ఏబీహెచ్‌ఎం అభ్యర్థిని బరిలో దిపండం.. అదికాక హేమాంగి సఖి మాత వంటివారు పోటీలో నిలవడం అందరిలో ఆసక్తిని రేపుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే బలమైన నేతగా పేరుపొందారు. అలాంటి వ్యక్తిపై హేమాంగి పోటీ చేయడం అంటే కూడా ఆషామాషీ కాదంటున్నారు.

Next Story