లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్: ముచ్చటగా మూడోసారి ప్రధానిగా మోదీనే..!

లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మరో రెండ్రోజుల్లోనే ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

By Srikanth Gundamalla  Published on  2 Jun 2024 6:20 AM IST
lok sabha election, exit poll, majority, nda alliance, pm modi,

లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్: ముచ్చటగా మూడోసారి ప్రధానిగా మోదీనే..!

లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఏడో దశ ఎన్నికల పోలింగ్ జూన్‌ 1న ముగిసింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిశాక.. ఆ వెంటనే 6.30 గంటలకు ఎగ్జిట్‌ పోల్స్ విడుదల అయ్యాయి. ఈ ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాలు ప్రజల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఎన్డీఏకు 400కి పైగా సీట్లు పైగానే వస్తాయని బీజేపీ నాయకులు విస్తృత ప్రచారం చేశారు. కానీ.. సర్వేలు మాత్రం ఆ లెక్కను తప్పించాయి. సొంతంగా 370 వరకు సీట్లు బీజేపీ గెలుస్తామని కుండబద్దలు కొట్టినా ఐదుకు పైగా ఎగ్జిట్‌ పోల్స్‌ గణాంకాలు ఆ సంఖ్యకు దగ్గరగా వచ్చి ఆగాయి. అయితే.. ఎన్డీఏ గెలుపొందే సీట్ల ఆధారంగా ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయని మాత్రం అంచనా వేశారు.

మరోవైపు బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో దూకుడు పెంచనుందని అంచనాలు ఉన్నాయి. బెంగాల్, ఒడిశాలో బీజేపీ ఎక్కువ సీట్లను రాబట్టుకోనుందని తెలుస్తోంది. ఇక ఢిల్లీలో అయితే బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ మేరకు ఆరు ఎగ్జిట్‌ పోల్స్‌ ఒత్తంగా ఎన్డీఏకు 357 సీట్లు రావొచ్చని అంచనా వేశాయి. ఇండియా కూటమికి 148 సీట్లు వస్తాయని చెబుతున్నాయి. బీజేపీ సొంతంగా 327 సీట్లు గెలుస్తుందని అంచనా వేశాయి. గరిష్టంగా ఎన్డీఏ కూటికి 362 నుంచి 392 సీట్లు రావొచ్చనీ జన్‌కీ బాత్‌ ఎగ్జిల్‌ తెలిపింది. విపక్ష కూటమి ఇండియాకు 141 నుంచి 161 సీట్లు రాబట్టుకోవచ్చని చెప్పింది. ఇక ఇండియా న్యూస్-డైనమిక్స్‌ అంచనా ప్రకారం ఎన్డీఏకు 371 సీట్లు, ఇండియా కూటమికి 125 సీట్లు గెలుస్తాయని చెప్పింది. దైనిక్‌ భాస్కర్‌ సర్వే.. ఎన్డీఏకు వచ్చే సీట్లు 281-350 వరకు ఉంటాయనీ.. ఇండియా కూటమికి 145-201 సీట్లు రావొచ్చని అంచనా వేసింది.

రిపబ్లిక్‌ టీవీ-సి మార్క్: ఎన్డీఏ: 359, ఇండియా కూటమి: 154, ఇతరులు 30

ఏబీపీ సి ఓటర్: ఎన్డీఏ: 353-383 , ఇండియా కూటమి: 152-182, ఇతరులు: 04-12

టుడేస్ చాణక్య: ఎన్డీఏ: 385-415 , ఇండియా కూటమి: 96-118, ఇతరులు: 27-45

న్యూస్ 18: ఎన్డీఏ: 355-370 , ఇండియా కూటమి: 125-140, ఇతరులు: 42-52

ఎన్డీటీవీ పోల్‌ ఆఫ్‌ పోల్స్: ఎన్డీఏ: 365 , ఇండియా కూటమి: 146, ఇతరులు: 32

రిపబ్లిక్ భారత్- మ్యాట్రిజ్ : ఎన్డీఏ: 353-368 , ఇండియా కూటమి: 118-133, ఇతరులు: 43-48

జన్‌కీ బాత్: ఎన్డీఏ: 362-392 , ఇండియా కూటమి: 141-161 , ఇతరులు: 10-20

ఇండియా టీవీ- సీఎన్‌ఎక్స్: ఎన్డీఏ: 371-401 , ఇండియా కూటమి: 109-139, ఇతరులు: 28-౩౮

Next Story