అత్యధిక ఓట్ల తేడాతో గెలిచిన లోక్‌సభ అభ్యర్థులు

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కాస్త భిన్నంగానే వచ్చాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Jun 2024 11:15 AM IST
lok sabha, candidates,   highest vote margins,

అత్యధిక ఓట్ల తేడాతో గెలిచిన లోక్‌సభ అభ్యర్థులు

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కాస్త భిన్నంగానే వచ్చాయి. విడిగా ఒక్క పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ రాలేదు. గతంలో పోలిస్తే బీజేపీకి సీట్లు తగ్గాయి. ఇక కాంగ్రెస్‌ మాత్రం కాస్త పుంజుకుంది. కొన్ని ప్రాంతీయ పార్టీలు సత్తాను చాటుకున్నాయి. ఇక లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా కొందరు అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారు. ఆ వివరాలను తెలుసుకుందాం..

లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి చెందిన నలుగురితో సహా కనీసం ఐదుగురు అభ్యర్థులు అత్యధిక విజయాల ఆధిక్యంతో మునుపటి రికార్డును బ్రేక్ చేసారు. ఇండోర్ ప్రస్తుత ఎంపి. బిజెపికి చెందిన శంకర్ లాల్వానీ 11.72 లక్షల మెజార్టీతో గెలిచాడు. అత్యధిక ఓట్లతో గెలిచిన వారి జాబితాలో శంకర్‌ లాల్వానీ అగ్రస్థానంలో ఉన్నారు. అస్సాంలోని ధుబ్రీ నుంచి కాంగ్రెస్‌కు చెందిన రకీబుల్ హుస్సేన్ 10.12 లక్షల మెజార్టీతో గెలిచారు. రెండో అత్యధిక విజయాన్ని సాధించారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విదిషా నుండి 8.21 లక్షల ఓట్లతో గెలుపొందారు. మూడవ అత్యధిక ఆధిక్యం సాధించారు. బిజెపికి చెందిన సిఆర్ పాటిల్ గుజరాత్‌లోని నవ్‌సారి నుండి 7.73 లక్షల ఆధిక్యాన్ని నమోదు చేశారు. గాంధీనగర్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా 7.44 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అక్టోబరు 2014లో మహారాష్ట్రలోని బీడ్ నుంచి 6.96 లక్షల ఓట్లతో గెలుపొందిన బీజేపీకి చెందిన ప్రీతమ్ ముండే అత్యధిక విజయాల ఆధిక్యంతో మునుపటి రికార్డును బ్రేక్‌ చేశారు.

కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్‌లోని గుణ నుంచి 5.40 లక్షల ఓట్లతో గెలుపొందారు. 5 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలిచిన ఇతర అభ్యర్థులలో పంచమహల్ నుండి బిజెపి గుజరాత్ అభ్యర్థులు రాజ్‌పాల్‌సింగ్ జాదవ్ (5.09 లక్షలు), వడోదర నుండి హేమంగ్ జోషి (5.82 లక్షలు), భోపాల్ అభ్యర్థి అలోక్ శర్మ (5.01 లక్షలు), మంద్‌సోర్ నుండి సుధీర్ గుప్తా ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ నుంచి బీజేపీ అభ్యర్థి మహేశ్ శర్మ 5.59 లక్షల ఓట్లతో గెలుపొందగా, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నుంచి కాషాయ పార్టీ అభ్యర్థి బ్రిజ్మోహన్ అగర్వాల్ 5.75 లక్షల ఆధిక్యంతో గెలుపొందారు.

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ 1.52 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి 3.90 లక్షల ఓట్లకు మెజార్టీ సాధించారు రాహుల్‌ గాంధీ. తద్వారా 2019లో ఇదే స్థానం నుంచి సోనియాగాంధీ ఆధిక్యాన్ని బ్రేక్‌ చేసినట్లు అయ్యింది. రాహుల్‌ గాందీ మరో స్థానం నుంచి కూడా పోటీ చేశారు. కేరళలోని వాయనాడ్ నుంచి కూడా రాహుల్‌ గాంధీ 3.64 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. బీజేపీకి చెందిన త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ త్రిపుర పశ్చిమ నుంచి 6 లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. త్రిపుర తూర్పు నియోజకవర్గం నుంచి త్రిపుర పార్టీకి చెందిన కృతి దేవ్ దెబ్బర్మన్ 4.86 లక్షలకు పైగా ఓట్లతో గెలుపొందారు.

Next Story