క్రిమినల్ కేసులున్న అభ్యర్థులూ లోక్‌సభ ఎన్నికల్లో విజయం

లోక్‌సభ ఎన్నికలు భిన్నంగా వచ్చాయి. ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Jun 2024 4:00 AM GMT
lok sabha candidates,  criminal cases,  won in elections,

క్రిమినల్ కేసులున్న అభ్యర్థులూ లోక్‌సభ ఎన్నికల్లో విజయం

లోక్‌సభ ఎన్నికలు భిన్నంగా వచ్చాయి. ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దాంతో.. మిత్రపక్షాల సాయంతోనే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలోనే లోక్‌సభ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులకు సంబంధించిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. క్రిమినల్‌ కేసుల్లో ఉన్న పలువురు అభ్యర్థులు కూడా లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు.

ఇదిగో జాబితా:

పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిజెపి అభ్యర్థులు సౌమిత్ర ఖాన్, తెలంగాణకు చెందిన మాధవనేని రఘునందన్ రావులపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 (రేప్‌కు శిక్ష) కింద కేసులు నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లోని బిష్ణుపూర్ నియోజకవర్గం నుంచి సౌమిత్ర ఖాన్ 5,567 ఓట్లతో గెలవగా.. తెలంగాణలోని మెదక్ నుంచి రఘునందన్‌ రావు 39,139 ఓట్లతో గెలుపొందారు.

ఇక పశ్చిమబెంగాల్‌లోని బంగావ్‌ నియోజవర్గం నుంచి బీజేపీకి ఎందిన శంతను ఠాకూర్ విజయం సాధించారు. ఆయనపై కూడా హత్యాయత్నం, ద్వేషపూరిత ప్రసంగం కింద కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచిన దులు మహతోపై క్రిమినల్ కేసులు, హత్యాయత్నం వంటి 22 తీవ్రమైన కేసులు ఉన్నాయి. తన బలూర్‌ఘాట్ స్థానాన్ని నిలబెట్టుకున్న బీజేపీ పశ్చిమ బెంగాల్ చీఫ్ సుకాంత మజుందార్‌పై 30 తీవ్రమైన కేసులు ఉన్నాయి. పోల్ రైట్స్ బాడీ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ప్రకారం, 1,643 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని బన్స్‌గావ్ నియోజకవర్గంలో బీజేపీ ఇచ్చిన టికెట్‌పై గెలిచిన కమలేష్ పాశ్వాన్‌పై హత్యాయత్నం సహా 16 తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. అదే యూపీలోని సుల్తాన్‌పూర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి మేనకా గాంధీని ఓడించిన సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రాంభువల్ నిషాద్‌పై 12 తీవ్రమైన కేసులు ఉన్నాయి.

Next Story