జూన్ 14 వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగింపు

Lockdown Extended in Tamil nadu.క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను విధించిన సంగ‌తి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Jun 2021 7:18 AM GMT
జూన్ 14 వ‌ర‌కు లాక్‌డౌన్  పొడిగింపు

క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను విధించిన సంగ‌తి తెలిసిందే. కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్న‌ప్ప‌టికి పూర్తి స్థాయిలో క‌ట్ట‌డి కోసం లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి త‌మిళ‌నాడు చేరింది. మ‌రో వారం రోజుల పాటు లాక్‌డౌన్ ను పొడిగిస్తూ త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. దీంతో జూన్ 14 వ‌ర‌కు త‌మిళ‌నాడులో లాక్‌డౌన్ కొన‌సాగనుంది. కరోనా కట్టడిపై అధికారులతో సమీక్ష చేసిన మరుసటి రోజే లాక్ డౌన్ ను పొడిగిస్తూ స్టాలిన్ స‌ర్కారు ఉత్త‌ర్వులిచ్చింది.

అయితే.. నిబంధ‌న‌ల్లో కొంత వెసులుబాటు ఇచ్చింది. చెన్నైకి మరిన్ని సడలింపులను ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే అనుమతించిన కార్యకలాపాలకు అన్ని జిల్లాల్లోనూ అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. కిరాణా దుకాణాలు, కూరగాయలు, మాంసం, చేపల మార్కెట్లను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు 30 శాతం సిబ్బందితో న‌డ‌వ‌నున్నాయి. చెన్నై లాంటి సిటీల్లో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, హౌస్ కీపింగ్ ఏజెన్సీలకూ ఈ–రిజిస్ట్రేషన్ ద్వారా సేవలందించేందుకు అనుమతులిచ్చింది. ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, మోటార్ టెక్నీషియన్లు, కార్పెంటర్లు, వాహన మెకానిక్ లకూ ఓకే చెప్పింది.

రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు త‌మిళ‌నాడులో మొద‌ట‌ మే 10 నుంచి 24 వ‌ర‌కు పూర్తి స్థాయి లాక్‌డౌన్ ను విధించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌రువాత స్టాలిన్ తీసుకున్న‌మొద‌టి ప్ర‌దాన నిర్ణ‌యాల్లో లాక్‌డౌన్ ఒక‌టి

Next Story