దేశ వ్యాప్తంగా డిసెంబర్‌ 1 నుంచి లాక్‌డౌన్‌..?.. వైరల్‌ అవుతున్న ట్వీట్‌కు వివరణ ఇచ్చిన కేంద్రం

Lockdown again from December 1st.. ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో రీయల్ న్యూస్‌ కంటే ఫేక్‌ న్యూస్‌ ఎక్కువగా

By సుభాష్  Published on  13 Nov 2020 1:16 PM GMT
దేశ వ్యాప్తంగా డిసెంబర్‌ 1 నుంచి లాక్‌డౌన్‌..?.. వైరల్‌ అవుతున్న ట్వీట్‌కు వివరణ ఇచ్చిన కేంద్రం

ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో రీయల్ న్యూస్‌ కంటే ఫేక్‌ న్యూస్‌ ఎక్కువగా వైరల్‌ అవుతున్నాయి. ఎలాంటి హద్దు.. పద్దు లేకుండా సోషల్‌ మీడియాలో అసత్యాలు ఎక్కువగా ప్రచారం జరుగుతున్నాయి. ఇలాంటి పోస్టులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అయినా ఫేక్‌ న్యూస్‌ ఏ మాత్రం ఆగడం లేదు. అయితే కొన్ని పోస్టులు విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ప్రజలను కలవరపెట్టే ఓ పోస్టు తెగ వైరల్‌ అవుతోంది.

దేశంలో కోవిడ్‌ కేసులు ఇంకా అదుపులోకి రానందున డిసెంబర్‌ 1 నుంచి దేశ వ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తారు.. అనే ట్వీట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయమై కేంద్ర సరర్కార్‌ వెంటనే స్పందించింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న లాక్‌డౌన్‌ విషయాన్ని కొట్టిపారేసింది. ఆ ట్వీట్‌లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. ఎవరో మార్ఫింగ్ చేశారని, ప్రెస్‌ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది. మరోసారి దేశంలో లాక్‌డౌన్ వధించడంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ట్వీట్‌ చేసింది. సోషల్‌ మీడియాలో ఇలాంటి పోస్టులను నమ్మవద్దని సూచించింది.

కాగా, ఇది వరకే విధించిన లాక్‌డౌన్ కారణంగా ఎంతో నష్టం వాటిల్లింది. సామాన్యుడి నుంచి ప్రభుత్వాల వరకు కరోనా మహమ్మారి చేసిన నష్టం అంతా ఇంతా కాదు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు సైతం ప్రత్యేక చర్యలు చేపట్టాయి. గతంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగినా.. ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం దేశంలో అన్‌లాక్‌ 6.0 ప్రక్రియ కొనసాగుతోంది. అందుకు కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలు అమలవుతున్నాయి.



Next Story