బాబా సిద్ధిఖీ హత్యకు వారే బాధ్యులట
సిద్ధిఖీ హత్య కేసులో పోలీసులు ఇప్పటి వరకు ముగ్గురిని అదుపులోకి
By Medi Samrat Published on 13 Oct 2024 10:46 AM GMTఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యకు తామే బాధ్యులమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆదివారం ప్రకటించింది. శనివారం రాత్రి ముంబైలోని బాంద్రాలో 66 ఏళ్ల ప్రముఖ రాజకీయ నాయకుడు బాబా సిద్ధిఖీని కాల్చి చంపారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా, దావూద్ ఇబ్రహీం వంటి అండర్‌వరల్డ్ వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయనే కారణంతోనే సిద్ధిఖీని లక్ష్యంగా చేసుకున్నట్లు లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు ఫేస్‌బుక్ లో పోస్ట్ పెట్టాడు.
సిద్ధిఖీ హత్య కేసులో పోలీసులు ఇప్పటి వరకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. సిద్ధిఖీని అంతమొందించేందుకు నిందితులు రెక్కీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. సిద్ధిఖీ హత్య కోసం నిందితులు ఒక్కొక్కరికి రూ.50 వేలు అడ్వాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి ఆయుధాలు నిందితుల చేతుల్లోకి చేరాయని అనుమానిస్తున్నారు. "మాకు ఎవరితోనూ వ్యక్తిగత శత్రుత్వం లేదు. అయితే, సల్మాన్ ఖాన్‌కి, దావూద్ గ్యాంగ్‌కు సహాయం చేసే వారెవరైనా సరే సిద్ధంగా ఉండాలి. మా సోదరులు ఎవరైనా చనిపోతే, మేము ప్రతిస్పందిస్తాము. జై శ్రీరామ్, జై భారత్, వందనం అమరవీరులకు" అని ఫేస్ బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. పోస్ట్ వైరల్ కావడంతో, ముంబై పోలీసులు దాని ప్రామాణికతను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
సిద్ధిఖీ హత్యను కాంట్రాక్ట్ కిల్లర్స్ చేశారని ముంబై పోలీసు వర్గాలు తెలిపాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయంపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇద్దరు నిందితులు హర్యానాకు చెందిన గుర్మైల్ బల్జీత్ సింగ్ (23), ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మరాజ్ రాజేష్ కశ్యప్ (19)లను అరెస్టు చేయగా, మూడవ వ్యక్తి యుపికి చెందిన శివ కుమార్ పరారీలో ఉన్నాడు. కాల్పుల వెనుక సూత్రధారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.

Next Story