విన్యాసంలో విషాదం.. లద్ధాఖ్‌లో ఐదుగురు జవాన్లు మృతి
లద్దాఖ్‌లో భారత సైన్యం విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు వచ్చాయి.
By Srikanth Gundamalla Published on 29 Jun 2024 6:43 AM GMTవిన్యాసంలో విషాదం.. లద్ధాఖ్‌లో ఐదుగురు జవాన్లు మృతి
భారత్ సరిహద్దుల్లో విషాదం చోటుచేసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో భారత సైన్యం విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు వచ్చాయి. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు గల్లంతు అయ్యారు. లద్దాఖ్ సమీపంలోని వాస్తవాధీన రేక సమీపంలో గల న్యోమా-చుషల్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు అధికారులు.
శనివారం తెల్లవారుజామున ఈ సంఘటన లేహ్‌కు 148 కిలోమీటర్ల దూరంలోని బోధి నదిలో చోటుచేసుకున్నట్లు ఇండియన్ ఆర్మీ ఉన్నతాధికారులు చెప్పారు. ఆర్మీ జవాన్లు ఉదయం విన్యాసాలు చేపట్టారు. విన్యాసాల్లో భాగంగా యుద్ధ ట్యాంకర్‌లతో నదిని దాటుతుండగా ఈ వరదలు ఆకస్మికంగా సంభవించాయని చెప్పారు. నదిలో ఒక్కసారిగా నీటి ఉధృతి పెరిగి టీ-72 యుద్ధ ట్యాంక్ ఒక్కసారిగా మునిగిపోయింది. దాంతో.. యుద్ధ ట్యాంకులో ఉన్న ఐదుగురు జవాన్లు నది ప్రవాహంలో గల్లంతు అయినట్లు రక్షణ శాఖ అదికారులు చెప్పారు. దురదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో వారంతా ప్రాణాలు కోల్పోయినట్లు రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. ఐదుగురి మృతదేహాలను నది నుంచి వెలికి తీసినట్లు చెప్పారు. మృతుల్లో జూనియర్ కమిషన్డ్ అధికారి కూడా ఉన్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.