మణిపూర్‌ కొత్త గవర్నర్‌గా లా గణేషన్ నియామ‌కం

La Ganesan appointed as governor of Manipur.మణిపూర్‌ కొత్త గవర్నర్‌గా బీజేపీ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 22 Aug 2021 1:34 PM IST

మణిపూర్‌ కొత్త గవర్నర్‌గా లా గణేషన్ నియామ‌కం

మణిపూర్‌ కొత్త గవర్నర్‌గా బీజేపీ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు లా గణేషన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 20న గవర్నర్‌ పదవి నుంచి తప్పుకున్న నజ్మా హెప్తుల్లా స్థానంలో లా గణేషన్‌ ఎంపికయ్యారు. ఇక రాజ్యసభ సభ్యుడిగా సేవలందించిన లా గణేషన్‌ బీజేపీ పలు కీలక పదవులు నిర్వహించారు. తమిళనాడు రాష్ట్ర శాఖ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.

అలాగే.. పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. లా గణేషన్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా నజ్మా హెప్తుల్లా స్థానంలో 2016-2018 వరకు కొనసాగారు. తమిళనాడు బీజేపీ ప్రధాన కార్యదర్శిగా నియమితులవడానికి ముందు, ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రచారక్‌గా ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ నేషనల్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా ఉన్నారు.

Next Story