ప్రతిష్టాత్మక అండర్‌ వాటర్‌ మెట్రో రైల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

మెట్రో రైలు నీళ్ల కింద నుంచి దూసుకెళ్లుతుంది. ఒళ్లంత థ్రిల్‌ అయ్యే ఈ మెట్రోను ప్రధాని మోదీ ప్రారంభించారు.

By Srikanth Gundamalla  Published on  6 March 2024 5:33 AM GMT
kolkata, underwater metro rail,  prime minister modi,

 ప్రతిష్టాత్మక అండర్‌ వాటర్‌ మెట్రో రైల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

మెట్రో రైళ్లు వచ్చాక నగరాల రూపు రేఖలు మారుతున్నాయనే చెప్పాలి. ప్రధానంగా నగరాల్లో ట్రాఫిక్‌ సమస్యలను తగ్గించేందుకు ప్రభుత్వాలు మెట్రో రైళ్లను తీసుకొస్తున్నాయి. దాంతో.. వాహనాల్లో గంట పాటు కొనసాగే ప్రయాణం మెట్రో రైళ్లలో ఈజీగా చేరుకోవచ్చు. అంతేకాదు.. మెట్రోల్లో ప్రయాణం సులభం.. సుఖవంతం కూడా.

అయితే.. తాజాగా పశ్చిమబెంగాల్‌లో ప్రారంభం అయిన మెట్రో కథే వేరు. ఇది అన్నింటికంటే స్పెషల్. ఎందుకంటే.. ఈ మెట్రో రైలు నీళ్ల కింద నుంచి దూసుకెళ్లుతుంది. ఒళ్లంత థ్రిల్‌ అయ్యే ఈ మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. పచ్చజెండా ఊపి ఈ మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. బుధవారం నుంచి అండర్ వాటర్ మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. ఈ అండర్‌ వాటర్‌ మెట్రో రైలు హుగ్లీ నదీలో నిర్మించారు. టన్నెల్‌లో నుంచి మెట్రో రైలు బుల్లెట్ వేగంతో పరుగులు తీస్తోంది. దాదాపు 5 కిలోమీటర్ల మేర దూరం హుగ్లీ నది కింద నుంచి మెట్రో రైలు ప్రయాణం కొనసాగుతోంది. నీటి ఉపరితలానికి 16 మీటర్ల లోతులో ఈ మెట్రో రైళ్లు ప్రయాణం కొనసాగిస్తున్నాయి. రూ.120 కోట్ల వ్యయంతో కోల్‌కతా మెట్రో ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నిర్ఇంచింది. తూర్పు- పశ్చిమ మెట్రో 4.8 కిలోమీటర్ల విస్తరణ పనులు మొత్తం రూ.4,965 కోట్ల వ్యయంతో నిర్మించారు.

ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి అండర్ వాటర్‌ మెట్రో రైలును ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడ స్థానికంగా ఉన్న స్కూలు పిల్లలతో కలిసి ఈ మెట్రో రైలు ప్రయాణం చేశారు. ట్రైన్‌లో ప్రయాణం చేస్తున్నంత సేపు పిల్లలతో కలిసి కూర్చొని ముచ్చటించారు. కాగా.. సాధారణ ప్రయాణికులకు గురువారం నుంచి ఈ అండర్ వాటర్‌ మెట్రో రైలులోకి అనుమతి ఇస్తారని తెలుస్తోంది.

దేశంలో తొలి మెట్రో రైలు ప్రారంభం అయ్యింది కోల్‌కతాలోనే. ఇక తాజాగా ఈ అద్భుతమైన అండర్ వాటర్‌ మెట్రో రైలు కూడా కోల్‌కతాలోనే ప్రారంభం కావడం విశేషంగా మారింది. కోల్‌కతా-హౌరా మధ్య ఈ అండర్ వాటర్‌ మెట్రో రైలు పరుగులు తీస్తోంది. 2009లోనే ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. 2017లో టన్నెల్ నిర్మాణం పూర్తయ్యింది. తాజాగా అండర్ వాటర్ మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

Next Story