ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార సంఘటనపై తొలిసారి స్పందించిన రాహుల్

ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచార సంఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అయ్యాయి.

By Srikanth Gundamalla
Published on : 14 Aug 2024 6:18 PM IST

kolkata, trainee doctor,  rahul gandhi, comments ,

 ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార సంఘటనపై తొలిసారి స్పందించిన రాహుల్

కోల్త్‌కతాలోని ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచార సంఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ట్రైనీ డాక్టర్‌పై అతికిరాతకంగా అత్యాచారం చేసి.. హత్య చేశాడు నిందితుడు. అయితే.. ఇప్పటికే పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ సంఘటన నుంచి మాట్లాడని రాహుల్‌గాంధీ తాజాగా స్పందించారు. వైద్యురాలిపై జరిగిన దారుణ అత్యాచారం, హత్య సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చెప్పారు.

ఈ ఘటన భారత్‌ వ్యాప్తంగా వైద్య రంగంలో మహిళల్లో అభద్రతా భావం పెంచుతోందని చెప్పారు రాహుల్‌ గాంధీ. ఆసుపత్రి, స్థానిక పరిసరాలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. మెడికల్ కాలేజీ వంటి చోట డాక్టర్లకు భద్రత లేకపోతే తల్లిదండ్రులు తమ కూతుళ్లను చదువులకు ఎలా బయటకు పంగలరనే ఆలోచన రేకెత్తిస్తోంది. నిర్భయ కేసు తర్వాత దేశంలో అత్యాచారంపై కఠిన చట్టాలుఅమలవుతున్నా.. నేరాలను ఎందుకు విఫలం అవుతున్నారో అర్థం కావడం లేదన్నారు ఎంపీ రాహుల్ గాంధీ.

బాధితులకు న్యాయం చేయకుండా.. నిందితులను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాహుల్ ఆరోపించారు. ఈ పరిణామాలు చూస్తే ఆందోళన కలుగుతోందని అన్నారు. ఆస్పత్రి, స్థానిక పరిపాలనపై తీవ్రమైన ప్రశ్నలు లేవెనెత్తున్నాయని అన్నారు. హత్రాస్ నుంచి ఉన్నావ్ వరకు.. కథువా నుంచి కోల్‌కతా వరకు మహిళలపై నిరంతరం పెరుగుతున్న అరాచకాలపై తీవ్రమైన చర్చలు జరపాలన్నారు. వీటిని నిరోధించేందుకు ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీ కోరారు. ప్రస్తుతం ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ చేస్తోంది. మరోవైపు ఈ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా జూనియర్‌ డాక్టర్లు నిరసనలు చేస్తూనే ఉన్నారు.



Next Story