Kolkata: ఆస్పత్రిలో మహిళ పట్ల వార్డుబాయ్ అసభ్య ప్రవర్తన, అరెస్ట్

కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రి సంఘటన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రిలో మరో అనుచిత సంఘటన జరిగింది.

By Srikanth Gundamalla  Published on  15 Sept 2024 4:51 PM IST
Kolkata: ఆస్పత్రిలో మహిళ పట్ల వార్డుబాయ్ అసభ్య ప్రవర్తన, అరెస్ట్

కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రి సంఘటన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రిలో మరో అనుచిత సంఘటన జరిగింది. రాత్రివేళ నిద్రిస్తున్న ఓ మహిళ పట్ల వార్డుబాయ్ అనుచితంగా ప్రవర్తించాడు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నరు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

కోల్‌కతాలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చైల్డ్‌ హెల్త్‌లోని పిల్లలో వార్డులో ఈ సంఘటన జరిగింది. మహిళ రాత్రి సమయం కావడంతో పిల్లల వార్డులో నిద్రపోయింది. అప్పుడే ఆ వార్డు రూమ్‌లోకి వార్డు బాయ్‌గా పనిచేస్తున్న తనయ్‌ పాల్‌ (26) ప్రవేశించాడు. మహిళ నిద్రపోతున్నది చూసి ఆమె దగ్గరకు వెళ్లాడు. ఆమెను అనుచితంగా తాకి.. బట్టలు విప్పేందుకు ప్రయత్నించాడు. ఇక వెంటనే మేల్కొన్న ఆమె అతని నుంచి తప్పించుకుంది. తర్వాత కోల్‌కతా పోలీసులను ఆశ్రయించింది. సదురు వ్యక్తిపై ఫిర్యాదు చేసింది. బట్టలు విప్పే ప్రయత్నం చేసి.. సెల్‌ఫోన్లో రికార్డు చేసేందుకు ప్రయత్నించాడని సదురు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే.. తన బిడ్డ ఆరోగ్యం బాగో లేనందున ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నట్లు బాధితురాలు చెప్పింది. మహిళ ఫిర్యాదుతో మరుసటి రోజే తనయ్‌ పాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

కోల్‌కతా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్)లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు పాల్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. అనంతరం స్థానిక కోర్టులో హాజరుపరచగా, పోలీసు కస్టడీకి అనుమతించారు. కాగా.. ఈ నెల ప్రారంభంలో పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న నర్సుపై వేధింపులకు పాల్పడినందుకు ఒక వ్యక్తిని కూడా అరెస్టు చేశారు.

Next Story