హాస్టల్‌ బాత్రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చిన 22 ఏళ్ల యువతి.. ఇద్దరూ సురక్షితం

ఓ కంపెనీలో పనిచేస్తున్న కొల్లాంకు చెందిన 22 ఏళ్ల మహిళ ఆదివారం ఉదయం ఓ ప్రైవేట్ హాస్టల్‌లోని బాత్‌రూమ్‌లో బిడ్డను ప్రసవించింది.

By అంజి  Published on  5 May 2024 3:45 PM GMT
Kerala woman, Kochi,  private hostel

హాస్టల్‌ బాత్రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చిన 22 ఏళ్ల యువతి.. ఇద్దరూ సురక్షితం

లైంగిక వేధింపుల బాధితురాలు తన నవజాత శిశువును కొచ్చిలోని వీధిలోకి విసిరి, పసికందును చంపిన కొన్ని రోజుల తర్వాత.. మరో మహిళ సిటీ హాస్టల్‌లోని బాత్రూమ్‌లో ప్రసవించినట్లు ఆదివారం పోలీసులు తెలిపారు. కొచ్చిలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న కొల్లాంకు చెందిన 22 ఏళ్ల మహిళ ఆదివారం ఉదయం ఓ ప్రైవేట్ హాస్టల్‌లోని బాత్‌రూమ్‌లో బిడ్డను ప్రసవించింది. ఆమె హాస్టల్ మేట్స్ చాలా సేపు లోపల తలుపు లాక్ కావడంతో బలవంతంగా తెరవడంతో విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు చెప్పారు.

"హాస్టల్ నిర్వాహకులు మాకు సమాచారం అందించారు. మేము వెంటనే ఆమెను, బిడ్డను సమీపంలోని ఆసుపత్రికి తరలించాము. వారిద్దరూ ఇప్పుడు క్షేమంగా ఉన్నారు" అని వారు తెలిపారు. ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించామని, ఆమె సన్నిహితురాలు కూడా ఆసుపత్రికి చేరుకుందని పోలీసులు తెలిపారు. గర్భం దాల్చిన విషయం హాస్టల్ మేట్‌లకు తెలియదు.

మే 3న కొచ్చిని దిగ్భ్రాంతికి గురి చేసిన ఇలాంటి సంఘటనలో.. 23 ఏళ్ల మహిళ తన గర్భాన్ని దాచిపెట్టి, శుక్రవారం తెల్లవారుజామున తన అపార్ట్‌మెంట్ బాత్రూమ్‌లో బిడ్డను ప్రసవించింది. నవజాత శిశువును వీధిలో పడేసింది. ఆమె ఫ్లాట్ కాంప్లెక్స్ ఒక నాగరిక నివాస ప్రాంతంలో ఉంది. కన్సర్వెన్సీ కార్మికులు శిశువు చనిపోయినట్లు గుర్తించి, బిడ్డను ప్రసవించిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు.

Next Story