శబరిమల భక్తులకు అలర్ట్.. కేరళ ప్రభుత్వం కీలక ఆదేశాలు
అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. రద్దీ పెరుగుతున్న దృష్ట్యా శబరిమలకు..
By - అంజి |
శబరిమల భక్తులకు అలర్ట్.. కేరళ ప్రభుత్వం కీలక ఆదేశాలు
అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. రద్దీ పెరుగుతున్న దృష్ట్యా శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. భక్తులు భరీగా తరలివస్తున్న నేపథ్యంలో ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. స్పాట్ బుకింగ్స్‌ను 20 వేల నుంచి 5 వేలకు తగ్గించింది. వర్చువల్ క్యూ ద్వారా మరో 70 వేల మందిని అనుమతించనుంది. ఈ మేరకు రోజుకు 75 వేల మందికి దర్శనం కల్పించనుంది. అడవి మార్గంలో వచ్చే భక్తులకు పాసులు తప్పనిసరి అని స్పష్టం చేసింది. రద్దీని తగ్గించేందుకు నీలక్కల్ దగ్గర కొత్తగా 7 బుకింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది.
పాస్ లేకుండా నీలక్కల్ నుంచి శబరిమలకి ప్రవేశం ఉండదని తెలిపింది. స్పాట్ బుకింగ్ కోటా రోజుకు 5,000 మాత్రమేనని.. కోటా పూర్తయితే బుకింగ్ ఉండదని స్పష్టం చేసింది. స్పాట్ బుకింగ్ కేంద్రాలు: నీలక్కల్, వండిపెరియార్, సత్రం, ఎరుమెలి, చెంగన్నూర్ వద్ద ఏర్పాటు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. నీలక్కల్‌లో కోటా ముందే ముగిసే అవకాశం ఉందని, యాత్రికులు ఇతర కేంద్రాల్లోనే పాస్ పొందాలని సూచిస్తున్నారు. శబరిమలకు బయలుదేరే ముందు పాస్ తమ వద్ద ఉందని యాత్రికులు తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని చెబుతున్నారు. నీలక్కల్, పంపా, సన్నిధానం వద్ద భద్రతా ఏర్పాట్లకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఏదైనా అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు
శబరిమల హెల్ప్‌లైన్: 14432
ఇతర రాష్ట్రాల నుంచి శబరిమల వచ్చే భక్తులకు హెల్ప్ లైన్ నంబర్... 04735-14432