ప్రతి మహిళకు నెలకు రూ.1000.. గెలిపిస్తేనే
Kejriwal promises Rs 1,000 per month for every woman.ఓటర్లను ఆకట్టుకుని ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీల
By తోట వంశీ కుమార్ Published on 23 Nov 2021 8:12 AM ISTఓటర్లను ఆకట్టుకుని ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీల నాయకులు అనేక హామీలు ఇస్తుంటారు. వాటిలో కొన్ని ఆచరణ సాధ్యం అయ్యేవి, కొన్ని కానివి ఉంటాయి. ఏదీ ఏమైనప్పటికి గెలుపే లక్ష్యంగా పార్టీలు.. జనాకర్షక మెనిఫెస్టోలకు ప్రకటిస్తుంటాయి. తాజాగా ఆమ్ఆద్మీ(ఆప్) జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ఇచ్చిన హామీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పంజాబ్‌లో ఆప్ పార్టీని గెలిపిస్తే.. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్క మహిళకు ప్రతి నెలా రూ.1000 ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 'మిషన్ పంజాబ్'లో భాగంగా రెండు రోజు ల పర్యటన నిమిత్తం పంజాబ్‌కు వచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. సోమవారం మోగులో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఆప్ ను గెలిపిస్తే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళ బ్యాంకు ఖాతాలో ప్రతి నెల వెయ్యి రూపాయలు జమ చేస్తామన్నారు. ఇక ఇప్పటికే వృద్దాప్య పెన్షన్ పొందుతున్న వారికి ఈ మొత్తం అదనంగా చెల్లిస్తామన్నారు. ప్రతి ఇంటికి 300 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్‌ను అందిస్తామని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులను(ఔషదాలు) కూడా పంపిణీ చేస్తామని చెప్పుకొచ్చారు. 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. వచ్చే ఏడాది పంజాబ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆప్ ప్రణాళికలు రచిస్తోంది. కాగా.. ఆప్ ఇచ్చిన వాగ్దానంతో పంజాబ్ రాష్ట్రంలో కోటి మందికి పైగా మహిళ జీవితాలపై ప్రభావం చూపుతుందని.. ఇది తమ పార్టీకి లాబిస్తుందని ఆ పార్టీ ప్రణాళికలు వేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.