శుభ‌వార్త‌.. ఉచిత రేష‌న్ మ‌రో 6 నెల‌లు పొడిగింపు

Kejriwal Extends Free Ration Scheme to another 6 months.పేద‌ల‌కు ఢిల్లీ ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. ఉచిత రేష‌న్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Nov 2021 4:34 PM IST
శుభ‌వార్త‌.. ఉచిత రేష‌న్ మ‌రో 6 నెల‌లు పొడిగింపు

పేద‌ల‌కు ఢిల్లీ ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. ఉచిత రేష‌న్ ప‌థ‌కాన్ని మ‌రో ఆరు నెల‌లు పొడిగిస్తున్న‌ట్లు కేజ్రీవాల్ స‌ర్కార్‌ ప్ర‌క‌టించింది. మే 2022 వ‌ర‌కూ ఉచిత రేష‌న్ ప‌థ‌కాన్ని పొడిగించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు సీఎం కేజ్రీవాల్ శ‌నివారం సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద ఉచిత ఆహార ధాన్యాల సరఫరా ఈ నెల‌తో(న‌వంబ‌ర్ 30) ముగియ‌నుంది. అయితే.. త‌రువాత దీనిని పొడిగించే అవ‌కాశం లేద‌ని ఆరోగ్య శాఖ కార్యదర్శి సుదర్శన్ పాండే ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో కేజ్రీవాల్ ప్ర‌భుత్వం మ‌రో ఆరు నెల‌ల పాటు ఉచిత రేష‌న్ అందించాల‌ని నిర్ణ‌యించ‌డం ప్రాధాన్య‌తను సంత‌రించుకుంది.

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ద్ర‌వ్యోల్బ‌ణం, నిరుద్యోగం పెరిగింద‌న్నారు. సామాన్యులు క‌నీసం రెండు పూట‌లా తిండి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 'ప్రధాని గారూ..పేద ప్రజలకు ఉచిత రేషన్ సరఫరా పథకాన్ని మరో ఆరు నెలలు పొడిగించండి. ఢిల్లీ ప్రభుత్వం ఉచిత రేషన్ పథకాన్ని రాబోయే ఆరునెలలు పొడిగించింది' అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఢిల్లీ ప్రభుత్వం జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎఫ్‌ఎస్ఏ) 2013, పీఎంజీకేఎవై కింద లబ్ధిదారులకు ఉచిత రేషన్ అందిస్తోంది. 2000కు పైగా రేషన్ దుకాణాల ద్వారా 17.77 లక్షల రేషన్ కార్డుదారుల ద్వారా 72.78 లక్షల మంది లబ్ధిదారులకు ఉచిత రేష‌న్ అందిస్తోంది.

Next Story