పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కట్టప్ప కూతురు.. డీఎంకేలో చేరిక

By Knakam Karthik  Published on  19 Jan 2025 1:26 PM IST
Natioal News, Tamilnadu news, DMK, Stalin, Divya

పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కట్టప్ప కూతురు.. డీఎంకేలో చేరిక

ప్రముఖ సినీ నటుడు సత్యరాజ్ కూతురు దివ్య పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తమిళనాడు సీఎం స్టాలిన్ సమక్షంలో డీఎంకే పార్టీలో చేరారు. ఆమె తమిళనాడులో ప్రముఖ న్యూట్రిషనిస్ట్‌గా గుర్తింపు పొందారు. కాగా సత్యరాజ్ బాహుబలి, బాహుబలి-2 సినిమాల్లో కట్టప్పగా నటించి ఇండియా వైడ్‌గా పాపులర్ అయ్యారు.

తాను రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని గతంలో చెప్పారు దివ్య. అయితే తాను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి కారణమేంటి? ఎంపీగా పోటీ చేస్తారా? మంత్రి పదవి కోసం రాజకీయాల్లోకి వస్తున్నారా? వంటి ప్రశ్నలు అడిగారని ఆమె చెప్పారు. అయితే ఏ పదవి ఆశించో రాజకీయాల్లోకి రావాలని భావించాలని ఆమె గతంలో స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేయాలన్నదే తన ప్రధాన లక్ష్యం అని దివ్య తెలిపారు. తాను చాలా కాలంగతా పేదలకు సేవలు అందిస్తూ వస్తున్నట్లు చెప్పిన ఆమె, మహిళ్ మతి ఇయక్కం పేరుతో మూడేళ్ల క్రితమే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించినట్లు తెలిపారు. దాంతో తమిళనాడులోని నిరుపేదలకు పుష్టికరమైన ఆహారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

పొలిటికల్ ఎంట్రీ కన్ఫామ్ అయ్యాక ఒక రాజకీయ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడానికి పిలుపు వచ్చిందన్న ఆమె, మత తత్వ పార్టీల్లో చేరే ఆలోచన తనకు లేదని గతంలో వెల్లడించారు. అలాగని సొంతంగా పార్టీ రాజకీయ పార్టీ ప్రారంభించనని చెప్పారు. తాజాగా ఆమె అధికార డీఎంకేలో చేరారు.

Next Story