25 ఏళ్ల క్రితం తప్పిపోయిన మహిళ ఆచూకీ లభ్యం

25 ఏళ్ల క్రితం కుటుంబంతో సంబంధాలు తెగిపోయిన కర్ణాటకకు చెందిన 50 ఏళ్ల మహిళ ఆచూకీ హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో లభించింది.

By అంజి  Published on  25 Dec 2024 12:21 PM IST
Karnataka woman, missing, old age home, Himachal

25 ఏళ్ల క్రితం తప్పిపోయిన మహిళ ఆచూకీ లభ్యం

25 ఏళ్ల క్రితం కుటుంబంతో సంబంధాలు తెగిపోయిన కర్ణాటకకు చెందిన 50 ఏళ్ల మహిళ ఆచూకీ హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో లభించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వృద్ధాశ్రమంలో ఉంటున్న సాకమ్మ అనే మహిళ మళ్లీ తన కుటుంబంతో చేరింది. బుధవారం నాడు ఆమె తన సొంత రాష్ట్రానికి వెళ్లనుంది. కర్ణాటక రాష్ట్రం బళ్లారి దాననాయకనకెరె గ్రామానికి చెందిన సాకమ్మ 25 ఏళ్ల క్రితం తన పిల్లలతో కలిసి హోసపేటలో బంధువుల పెళ్లికి వెళ్లింది. అయితే, ఆమె అనుకోకుండా చండీగఢ్‌కు రైలు ఎక్కింది. ఆ తర్వాత వివిధ ఉత్తర భారత రాష్ట్రాలలో క్లిష్ట పరిస్థితులలో జీవించింది.

చివరికి ఆమె మండిలోని వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందింది. సాకమ్మ కుటుంబసభ్యులు మిస్సింగ్‌పై ఫిర్యాదు చేసి ఇన్నాళ్లుగా ఆచూకీ లభించకపోవడంతో ఆమె అంత్యక్రియలు కూడా చేశారు. ఒక యువ ఐపీఎస్‌ అధికారి వృద్ధాశ్రమాన్ని సందర్శించి, కన్నడలో మాట్లాడుతున్న మహిళను గుర్తించిన తర్వాత ఆమె తప్పిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ అధికారి సాకమ్మ మాట విని, తర్వాత కర్ణాటక ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖను సంప్రదించారు. అధికారులు ఆమె కుటుంబంతో మాట్లాడారు. ఆమె ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్లనుంది.

Next Story