మహిళ మృతదేహంపై అత్యాచారం నేరం కాదు: హైకోర్టు

కర్ణాటక హైకోర్టు తాజాగా నెక్రొఫిలియా కేసు విచారణలో సంచలన తీర్పు వెలువరించింది. మహిళ మృతదేహంపై అత్యాచారానికి పాల్పడటాన్ని

By అంజి  Published on  1 Jun 2023 5:00 AM GMT
Karnataka High Court, Acquittal, Rape Convict Acquitted, Rape FIR, Dead Body

మహిళ మృతదేహంపై అత్యాచారం నేరం కాదు: హైకోర్టు

కర్ణాటక హైకోర్టు తాజాగా నెక్రొఫిలియా కేసు విచారణలో సంచలన తీర్పు వెలువరించింది. మహిళ మృతదేహంపై అత్యాచారానికి పాల్పడటాన్ని (నెక్రోఫిలియా) భారతీయ శిక్షాస్మృతిలోని ఐసీపీ సెక్షన్‌ 375 కింద అత్యాచార నేరంగా పరిగణించలేమని, అలాగే సెక్షన్‌ 377 ప్రకారం అసహజ నేరాల పరిధిలోకి రాదని ధర్మాసనం పేర్కొంది. ఈ సెక్షన్ల కింద మృతదేహాన్ని వ్యక్తి, మనిషి అని పిలవలేమని, కావున నెక్రోఫిలియాను నేరంగా భావించలేమని హైకోర్టు తెలిపింది. 21 ఏళ్ల యువతిని హత్య చేసిన తర్వాత ఆమె మృతదేహంపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు అత్యాచారం ఆరోపణల నుండి ఓ వ్యక్తిని హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

జస్టిస్ బి వీరప్ప మరియు జస్టిస్ వెంకటేష్ నాయక్ టి డివిజన్ బెంచ్ దోషి రంగారావు దాఖలు చేసిన అప్పీల్‌ను పాక్షికంగా అనుమతించింది. తద్వారా కోడ్ సెక్షన్ 376 కింద శిక్షను రద్దు చేసింది. అయితే, అతని హత్య నేరాన్ని కోర్టు సమర్థించింది. ట్రయల్ కోర్టు విధించిన జీవిత ఖైదును నిర్ధారించింది. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 375, 377లోని నిబంధనలను జాగ్రత్తగా చదవడం వల్ల మృతదేహాన్ని మనిషిగా లేదా వ్యక్తిగా పిలవలేమని స్పష్టం చేసింది. తద్వారా, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 375 లేదా 377లోని నిబంధనలు వర్తించవని తెలిపింది.

అయితే ఇలాంటి చర్యలకు సంబంధించి శిక్షించడానికి చట్టాన్ని సవరించడం లేదా అమలు చేయడం గురించి ఆలోచించాలని బెంచ్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. నెక్రోఫిలియాను నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టానికి సవరణలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని కర్ణాటక హైకోర్టు ఇటీవలి ఉత్తర్వుల్లో అభిప్రాయపడింది. ఐపిసి సెక్షన్ 377ను సవరించాలని లేదా నెక్రోఫిలియాను నేరంగా పరిగణించేందుకు ప్రత్యేక శిక్షాస్మృతిని ప్రవేశపెట్టాలని కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

ప్రాసిక్యూషన్ కేసు ప్రకారం.. నిందితుడు జూన్ 25, 2015 న, 21 ఏళ్ల యువతిని మెడ కోసి హత్య చేసి, ఆపై ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. విచారణలో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత అతడిపై చార్జిషీట్ దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిని దోషిగా నిర్ధారించింది. దోషి తన అప్పీల్‌లో ఆరోపించిన చర్య 'నెక్రోఫిలియా' తప్ప మరొకటి కాదని, పైప పేర్కొన్న చర్యను శిక్షించే నిర్దిష్ట నిబంధన ఐపీసీలో లేదని వాదించాడు. దీంతో కోర్టు పైన తీర్పు వెలువరించింది.

Next Story