Karnataka elections: 100 శాతం నేను సీఎం సీటుని ఆశిస్తున్నా: సిద్ధరామయ్య
మేలో జరగనున్న కర్ణాటక ఎన్నికలకు ముఖ్యమంత్రి పదవిని ఆశించేవారిలో తానూ ఉన్నానని కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య గురువారం
By అంజి Published on 30 March 2023 5:15 PM ISTKarnataka elections: 100 శాతం నేను సీఎం సీటుని ఆశిస్తున్నా: సిద్ధరామయ్య
మేలో జరగనున్న కర్ణాటక ఎన్నికలకు ముఖ్యమంత్రి పదవిని ఆశించేవారిలో తానూ ఉన్నానని కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య గురువారం నాడు చెప్పారు. సీఎం కావాలనే ఆకాంక్ష, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌తో సమీకరణాలు, ఎన్నికలకు కాంగ్రెస్ సన్నాహాలు ఇలా పలు అంశాలపై ఇండియా టుడేతో సిద్ధరామయ్య సుదీర్ఘంగా మాట్లాడారు. కర్ణాటక మాజీ సిఎం మాట్లాడుతూ..''100 శాతం నేను ముఖ్యమంత్రి కావాలనుకునేవాడిని, ప్రస్తుత పరిస్థితుల ప్రకారం.. నేను, డీకే శివకుమార్ సీఎం పదవిని ఆశించేవారిలో ఉన్నారు. జి పరమేశ్వర గురించి నాకు తెలియదు. అయితే గతంలో తన ఆశయాల గురించి ప్రస్తావించాడు.. అందులో తప్పు లేదు'' అని అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కూడా అయిన సిద్ధరామయ్య మైసూరులోని వరుణ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాను కోలార్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తానని బుధవారం పునరుద్ఘాటించారు. మే 10న జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంటుందని , జనతాదళ్-సెక్యులర్ (జేడీఎస్) కింగ్ మేకర్ పాత్రను పోషిస్తుందని అంచనా. డీకే శివకుమార్‌తో ఉన్న సంబంధాల గురించి ప్రశ్నించగా.. "కాంగ్రెస్ పూర్తిగా ఐక్యంగా ఉంది. ఆయన కూడా ఆశావహుల్లో ఒకరు. అందులో తప్పు లేదు. అంతిమంగా ఎన్నికైన ఎమ్మెల్యేలే శాసనమండలి నాయకుడిని నిర్ణయించాల్సి ఉంటుంది" అని సిద్ధరామయ్య అన్నారు.
సిద్ధరామయ్యను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఆ పార్టీ ఎన్నికల్లో విజయం సాధిస్తుందన్న ఓ ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘కాంగ్రెస్ ఎప్పుడూ సీఎం అభ్యర్థి పేరును ప్రకటించదని, ఎన్నికైన ఎమ్మెల్యేలు, హైకమాండ్ నిర్ణయానికే వదిలేస్తాం’ అని అన్నారు. మే 10న జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే తన చివరి ఎన్నికల పోరు అని సిద్ధరామయ్య పునరుద్ఘాటించారు. 2018 ఎన్నికల తర్వాత ఏర్పడిన జేడీఎస్, కాంగ్రెస్‌ల సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, జూలై 2019లో కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మరోవైపు ఒకప్పుడు తమకు కంచుకోటగా ఉన్న కర్ణాటకలో మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.