కర్ణాటక ఎన్నికల ఫలితాలు.. ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళది..!

Karnataka Election Results. కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ వస్తుందని యతీంద్ర సిద్ధరామయ్య అంటున్నారు.

By Medi Samrat  Published on  13 May 2023 9:45 AM IST
కర్ణాటక ఎన్నికల ఫలితాలు.. ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళది..!

కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ వస్తుందని యతీంద్ర సిద్ధరామయ్య అంటున్నారు. ఏఎన్‌ఐ వార్తాసంస్థతో మాట్లాడిన కాంగ్రెస్ నాయకుడు యతీంద్ర సిద్ధరామయ్య మాట్లాడుతూ తమ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించి, సొంత బలంతో కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. తన తండ్రి, సీనియర్ నాయకుడు సిద్ధరామయ్య కర్ణాటకకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు అన్నారు. కర్నాటకలో కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే నమ్మకం తమకు ఉందని అన్నారు.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాజిక్‌‌‌‌ ఫిగర్‌‌‌‌‌‌‌‌ను దాటి మెజారిటీ సాధించి, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం బసవరాజు బొమ్మై ధీమా వ్యక్తం చేశారు. పూర్తీ మెజారిటీ వస్తున్నప్పుడు ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ‘‘మాకు పూర్తి మెజారిటీ వస్తుందని నమ్మకంగా ఉన్నాం. అన్ని నియోజకవర్గాలు, జిల్లాల నుంచి గ్రౌండ్‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌ను తెప్పించుకున్నాం. వాటిని చూశాక మేము మ్యాజిక్‌‌‌‌ ఫిగర్‌‌‌‌‌‌‌‌ చేరుకుంటామని నమ్మకంతో ఉన్నాం” అని బొమ్మై అన్నారు. కాంగ్రెస్‌‌‌‌ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని, అందుకే కాంగ్రెస్‌‌‌‌ ఇతర పార్టీలతో టచ్‌‌‌‌లో ఉంటూ, రిసార్ట్‌‌‌‌లు బుక్‌‌‌‌ చేశారన్నారు. వారి ఎమ్మెల్యేలపైన వారికే నమ్మకంలేదని అన్నారు. శుక్రవారం సీఎం బొమ్మై, మంత్రులు మురుగేశ్‌‌‌‌ నిరాణి, బైరాథి బసవరాజ్‌‌‌‌, ఎంపీ లెహర్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌ సిరోయాతో పాటు ఏటీ రామస్వామి, మాజీ సీఎం యడియూరప్పతో భేటీ అయ్యారు.


Next Story