సీఎంకు క‌రోనా.. ఢిల్లీ ప‌ర్య‌ట‌న ర‌ద్దు

Karnataka CM Basavaraj Bommai tests positive for Covid.క‌ర్ణాట‌క సీఎం బసవరాజ్ బొమ్మై క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Aug 2022 1:01 PM IST
సీఎంకు క‌రోనా.. ఢిల్లీ ప‌ర్య‌ట‌న ర‌ద్దు

క‌ర్ణాట‌క సీఎం బసవరాజ్ బొమ్మై క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్లడించారు. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నాన‌ని చెప్పారు. అందులో పాజిటివ్‌గా వ‌చ్చింద‌ని ట్వీట్ చేశారు. బొమ్మై ప్ర‌స్తుతం ఐసోలేష‌న్‌లో ఉన్నారు.

ఇక గ‌త కొద్ది రోజులుగా త‌న‌ను క‌లిసిన వారంతా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సీఎం సూచించారు. త‌క్ష‌ణ‌మే వారంతా ఐసోలేష‌న్‌కు వెళ్లాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. క‌రోనా పాజిటివ్‌గా రావ‌డంతో ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు.

కాగా.. జూలై 25,26 తేదీల్లో బొమ్మై ఢిల్లీలో ప‌ర్య‌టించారు. రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకార కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన సంగ‌తి తెలిసిందే.

Next Story