స్నానం చేస్తుండ‌గా వీడియోలు తీశార‌ని విద్యార్థినుల ఫిర్యాదు

Kanpur Hostel Girl Students Allege Staff Filmed Them Secretly While Bathing.స్నానం చేస్తుండ‌గా ర‌హ‌స్యంగా వీడియోలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Sept 2022 9:08 AM IST
స్నానం చేస్తుండ‌గా వీడియోలు తీశార‌ని విద్యార్థినుల ఫిర్యాదు

తాము స్నానం చేస్తుండ‌గా ఓ వ్య‌క్తి ర‌హ‌స్యంగా వీడియోలు తీశాడ‌ని హాస్ట‌ల్‌ విద్యార్థినులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అయితే.. పోలీసులు ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేదంటూ స్థానిక పోలీస్ స్టేష‌న్ ముందు విద్యార్థినులు నిర‌స‌న చేప‌ట్టారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో జ‌రిగింది.

కాన్పూర్‌లోని సాయి నివాస్ గ‌ర్ల్స్‌ హాస్ట‌ల్‌లో ప‌నిచేసే ఓ ఉద్యోగి విద్యార్థినులు స్నానం చేస్తుండ‌గా బాత్ రూమ్ కిటికీలోంచి ఫోన్‌తో వీడియోలు తీశాడ‌ని పోలీసుల‌కు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. అయితే.. పోలీసులు స్పందించ‌క‌పోవ‌డంతో గురువారం స్థానిక పోలీస్ స్టేష‌న్ ముందు నిర‌స‌న‌కు దిగారు.

దీనిపై పోలీసులు స్పందించారు. ఈ ఘ‌ట‌న పై కేసు న‌మోదు చేసి ఆ ఉద్యోగిని అరెస్టు చేసిన‌ట్లు తెలిపారు. అత‌డి మొబైల్ ఫోన్‌ని ఫోరెన్సిక్ ప‌రీక్ష‌ల కోసం ల్యాబ్ కు పంపిన‌ట్లు చెప్పారు.

ఇదిలా ఉంటే.. రెండు వారాల కింద‌ట పంజాబ్‌లోని చండీగఢ్ యూనివర్సిటీలో ఒక విద్యార్థిని తన సహ విద్యార్థినులు స్నానం చేస్తుండగా వీడియోలు తీసి వాటిని తన బాయ్ ఫ్రెండ్ కు పంపింది. ఈ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో చంఢీగ‌ఢ్ యూనివ‌ర్సిటీ భ‌గ్గుమ‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ ఘ‌ట‌నను మ‌రువ‌క‌ముందే ఇదే త‌ర‌హా ఘ‌ట‌న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ లో వెలుగుచూడ‌డం గ‌మ‌నార్హం.

Next Story