హిందుత్వంపై అభ్యంతరకరమైన ట్వీట్.. ప్రముఖ నటుడు అరెస్ట్‌

కన్నడ నటుడు చేతన్ కుమార్‌ అహింసాను మంగళవారం బెంగళూరులో అరెస్టు చేశారు. ''హిందుత్వం అబద్ధాల మీద నిర్మించబడింది''

By అంజి  Published on  21 March 2023 9:35 AM GMT
Kannada Actor, Chetan Kumar

హిందుత్వంపై అభ్యంతరకరమైన ట్వీట్.. ప్రముఖ నటుడు అరెస్ట్‌

కన్నడ నటుడు చేతన్ కుమార్‌ అహింసాను మంగళవారం బెంగళూరులో అరెస్టు చేశారు. ''హిందుత్వం అబద్ధాల మీద నిర్మించబడింది'' అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో తెగవైరల్‌గా మారింది. చేతన్‌ అహింసా ట్వీట్‌పై హిందూ భావజాలం కలిగిన వారి నుంచి విమర్శలు వచ్చాయి. అతని ట్వీట్‌ హిందువుల మనోభావాలను రెచ్చగొట్టేలా ఉందని పలువురు నెటిజన్లు పేర్కొన్నారు. ఈరోజు ఉదయం శేషాద్రిపురం పోలీసులు చేతన్‌ని అరెస్టు చేసి జిల్లా కోర్టులో హాజరుపరిచారు.

''హిందుత్వం అబద్ధాల మీద నిర్మించబడింది.

సావర్కర్‌: రాముడు రావణుడిని ఓడించి అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు భారత 'దేశం' ప్రారంభమైంది -> అబద్ధం

1992: బాబ్రీ మసీదు 'రాముడి జన్మస్థలం' -> అబద్ధం

2023: ఉరిగౌడ - నంజేగౌడ టిప్పు హంతకులు -> అబద్ధం

హిందుత్వను సత్యం ద్వారా ఓడించవచ్చు-> సత్యమే సమానత్వం” అంటూ చేతన్ అహింసా ట్వీట్‌ చేశారు.

ట్వీట్‌ ఆధారంగా భజరంగ్ దళ్ సభ్యుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నటుడిపై కేసు నమోదు చేయబడింది. అతన్ని అరెస్టు చేశారు. చేతన్‌ ఒక మతం లేదా మత విశ్వాసాలను అవమానించడం, కొన్ని వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించే ప్రకటనలు చేయడం వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. 39 ఏళ్ల నటుడు కూడా దళిత, గిరిజన ఉద్యమకారుడు. ఫిబ్రవరి 23, 2022న, కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ దీక్షిత్‌పై ఆరోపించిన వ్యాఖ్యలకు కూడా నటుడిని అరెస్టు చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల నుండి హిజాబ్‌ను నిషేధించాలన్న బొమ్మై ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన బెంచ్‌లో దీక్షిత్ ఒక భాగం.

Next Story