తమిళనాడు ఎన్నికల ఫలితాల విషయంలో తెలుగు ప్రజలు కూడా ఆసక్తి కనబరిచే అంశం ఏమిటంటే నటుడు కమల్ హాసన్ లీడింగ్ లో ఉన్నారా లేదా..? అని..! మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడైన కమల్ హాసన్ కోయంబత్తూరు(దక్షిణం) నియోజకవర్గం నుండి పోటీకి నిలబడ్డారు.
ప్రస్తుతం ఆయన లీడింగ్ లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నేత మయూర జయకుమార్ మీద కమల్ హాసన్ లీడింగ్ లో ఉన్నారు. కౌంటింగ్ జరుగుతున్న జిసిటి కాలేజీ వద్దకు కమల్ హాసన్ కూడా చేరుకున్నారు. కమల్ హాసన్ పోటీ చేసిన కోయంబత్తూరు(దక్షిణం) ప్రాంతంలో ఎక్కువగా తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. వారు ఓట్లేస్తారనే నమ్మకంతోనే కమల్ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అనుకున్నట్లుగానే ప్రస్తుతం కమల్ హాసన్ లీడ్ లో కొనసాగుతూ ఉన్నారు. కమల్ గెలవాలని ఆయన కుమార్తెలు అక్షర, శృతి హాసన్ లు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే..! ఇక నటి సుహాసిని కూడా కమల్ గెలుపు కోసం తన వంతు ప్రచారం చేశారు. కమల్ హాసన్ పార్టీ మాత్రం ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అసలైన పొలిటికల్ వార్ డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్యనే కొనసాగింది.