కుమార్తె సాయంతో నడుస్తూ ప్రచారం చేసిన కమల్

Kamal Haasan Election campaigning With Daughter. కోయంబత్తూర్‌ దక్షిణ నియోజకవర్గంలో తన కుమార్తె అక్షర హాసన్‌ సాయంతో ఊతకర్రతో నడుస్తూ ఓట్లను అడిగారు కమల్.

By Medi Samrat  Published on  4 April 2021 10:45 AM GMT
Kamal Haasan with daughter help

కమల్ హాసన్ ఇటీవలే గాయపడిన సంగతి తెలిసిందే..! ఇక ఎన్నికల్లో తమ పార్టీ మక్కల్‌ నీది మయ్యం (ఎం ఎన్‌ఎం) ను గెలిపించుకోడానికి ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆయన పోటీ చేస్తున్న కోయంబత్తూర్‌ దక్షిణ నియోజకవర్గంలో ప్రచారం కూడా చేశారు. ఇక‌ తన కుమార్తె అక్షర హాసన్‌ సాయంతో ఊతకర్రతో నడుస్తూ ఓట్లను అడిగారు కమల్. ఇటీవల తన కాలికి శస్త్రచికిత్స చేయించుకున్న కమల్‌హాసన్‌, తాను పోటీ చేస్తున్న నియోజకవర్గ పరిధిలోని ఫ్లవర్‌మార్కెట్‌ ప్రాంతంలో ప్రచారంలో పాల్గొన్నారు.


రద్దీలో ఆయన కాలును ఎవరో తొక్కడంతో నొప్పి అధికం కావడంతో వైద్యులను సంప్రదించగా విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారు. తన కుమార్తె అక్షరహాసన్‌తో కలిసి ఊతకర్రతో నడుస్తూ రేస్‌ కోర్స్‌ ప్రాంతంలో ఇంటింటికీ వెళ్లి 'టార్చ్‌లైట్‌' గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని అభ్యర్ధించారు.

కమల్ హాసన్‌కు మద్దతుగా అక్షర హాసన్, సుహాసిని ప్రచారం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నికల ప్రచారంలో వీరిద్దరు తీన్మార్ డాన్స్‌లతో రచ్చ చేశారు. చేతిలో మక్కల్ నీది మయ్యం ఎన్నికల గుర్తు టార్చ్ లైట్‌ను పట్టుకొని డ్యాన్స్ చేశారు. పలు ప్రాంతాల్లో సుహాసిని కూడా కమల్ పార్టీని గెలిపించాలని కోరుతూ ప్రచారం చేశారు.Next Story
Share it