కారు ప్రమాదం.. 'కచా బాదం' సింగర్‌కు గాయాలు

'Kacha Badam' singer Bhuban Badyakar meets with a car accident. ఇటీవల సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ ఉన్న సాంగ్‌ ఏదంటే.. అందరూ 'కచా బాదం' సాంగ్‌ గురించే చెబుతారు.

By అంజి  Published on  1 March 2022 10:26 AM IST
కారు ప్రమాదం.. కచా బాదం సింగర్‌కు గాయాలు

ఇటీవల సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ ఉన్న సాంగ్‌ ఏదంటే.. అందరూ 'కచా బాదం' సాంగ్‌ గురించే చెబుతారు. అయితే ఆ పాట పాడిన సింగర్‌ భుబన్ బద్యాకర్ సోమవారం కారు ప్రమాదానికి గురయ్యారు. అతను ఇటీవల కొనుగోలు చేసిన సెకండ్‌ హ్యాండ్‌ కారు నడపడం నేర్చుకుంటున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. సింగర్‌ భుబన్‌ బద్యాకర్‌కు ఛాతీలో గాయం కావడంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స జరుగుతోంది. అతని పాట' కచా బాదం' వైరల్ కావడంతో రాత్రికి రాత్రే స్టార్‌డమ్‌ సంపాదించుకున్నాడు భుబన్‌.

పశ్చిమ బెంగాల్‌లో వేరుశెనగలు అమ్మే భుబన్ ఇటీవల కోల్‌కతాలోని ఖరీదైన పబ్‌లో ప్రదర్శన ఇచ్చాడు. దాని కోసం అతను మెరిసే నల్లటి జాకెట్‌ని ధరించి అందరిని దృష్టికి ఆకర్షించాడు. బీర్భూమ్‌ జిల్లాలో పల్లిలు అమ్ముకునే.. భుబన్‌ కొనుగోలు దారులను ఆకర్షించేందుకు 'కచా బాదం' సాంగ్‌ను కంపోజ్‌ చేశాడు.

భుబన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నేను ఈ పాటతో మొదటిసారి పల్లిలు అమ్ముతున్నప్పుడు.. నా ప్రాంతంలో చాలా మంది నన్ను అవమానించారు. ఎగతాళి చేసారు. ఇప్పుడు ఈ పాట వైరల్ కావడంతో నన్ను అవమానించిన వారు కలవాలనుకుంటున్నారు. కొందరు నన్ను వారితో సెల్ఫీ దిగమని కూడా కోరారు. సమయం, అదృష్టం కలిసి వస్తే ప్రతి ఒక్కరి జీవితాలు మారతాయి." అన్నారు. మరోవైపు భుబన్‌ తన పాటల వృత్తిని కొనసాగించాలనుకుంటున్నాడు. వేరుశెనగ అమ్మడం మానేయాలని నిర్ణయించుకున్నాడు.

Next Story