జువైనల్ హోమ్‌లో చిన్నారులపై మహిళా అధికారి అమానుషం

జువైనల్‌ హోమ్‌లో పిల్లలకు రోణ కల్పించాల్సిన ఓ ప్రభుత్వ మహిళా అధికారి చిన్నారులపై అమానుషంగా ప్రవర్తించింది.

By Srikanth Gundamalla  Published on  14 Sep 2023 11:03 AM GMT
juvenile home, superintendent, child, viral video,

జువైనల్ హోమ్‌లో చిన్నారులపై మహిళా అధికారి అమానుషం

ఉత్తర్‌ ప్రదేశ్‌లో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. జువైనల్‌ హోమ్‌లో పిల్లలకు రోణ కల్పించాల్సిన ఓ ప్రభుత్వ మహిళా అధికారి చిన్నారులపై అమానుషంగా ప్రవర్తించింది. బాల ఖైదీలుగా హోమ్‌లో ఉన్న పిల్లలకు మంచి బుద్ధులు నేర్పి.. సత్ప్రవర్తన అలవాటు చేయాల్సింది పోయి దారుణంగా ప్రవర్తించింది. చిన్నారులనే కనికరం కూడా లేకుండా కర్కశంగా చేయి చేసుకుంది.

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటుచేసుకుంది ఈ సంఘటన. మహిళా సూపరింటెండెంట్ పూనమ్‌ పాల్‌ చిన్నారులను కొడుతున్న దృశ్యాలు జువైనల్‌ హోమ్‌లోని సీసీటీవీలో రికార్డు అయ్యాయి. మహిళా అధికారి చిన్నారులను కొడుతున్న వీడియో సోమవారం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆరుగురు చిన్నారులు బెడ్స్‌పై పడుకుని ఉన్న సమయంలో.. అక్కడికి వెళ్లిన సూపరింటెండెంట్ పాల్‌ ఇతర ఉద్యోగులు చూస్తుండగానే ఒక్కసారిగా చిన్నారిపై దాడి చేసింది. చెప్పుతో పలుమార్లు చెంపదెబ్బలు కొట్టింది. అంతేకాదు.. మిగతా పిల్లలను కూడా తిట్టడం వీడియోలో కనిపించింది.

సోమవారం ఒక వీడియో వెలుగులోకి రాగా.. ఆ తర్వాత రోజే మరో వీడియో బయటకు వచ్చింది. ఇందులో మళ్లీ సూపరింటెండెంట్ ఏడేళ్ల వయసున్న అమ్మాయి చేతులు, కాళ్లను మంచానికి కట్టేసి పడుకోబెట్టింది. విడిపించేందుకునేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. మంచం కిందకు జారిపోతుంది. ఈ రెండు వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సదురు మహిళా అధికారపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సూపరింటెండెంట్‌ను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ఇక రెండు ఘటనపై ఉన్నతాధికారలు స్పందించారు. దర్యాప్తు చేశారు. అక్కడ కూడా పిల్లలపట్ల ఇంతే క్రూరంగా వ్యవహరించారని అధికారుల విచారణలో తేలింది. క్రూరంగా వ్యవహరించిన హోమ్‌ సూపరింటెండెంట్‌ పూనమ్‌ పాల్‌ను అధికారులు విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. సూపరింటెండెంట్‌తో పాటు ఇతర సిబ్బందిని కూడా సస్పెండ్ చేసినట్లు ఉన్నతాధికారులు చెప్పారు.

Next Story